టీజర్ టాక్ః సముద్రంతో హీరో హీరోయిన్ కబడ్డీ

Update: 2016-10-19 14:10 GMT
డియర్ జిందగీ.. బాలీవుడ్ లో హఠాత్తుగా సెన్సేషన్ అయిపోయిందీ మూవీ. షారూక్ ఖాన్ - ఆలియా భట్ లు జంటగా సినిమా అనగానే అందరి నోళ్లలో నానిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరిపేసుకుని.. ఇప్పుడు రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది. నవంబర్ 25న రిలీజ్ కి షెడ్యూల్ చేయగా.. సరిగ్గా 5 వారాల ముందు నుంచి ప్రచారం స్టార్ట్ చేసేసింది డియర్ జిందగీ యూనిట్.

ఫస్ట్ లుక్ ఇచ్చిన 24 గంటల్లోనే డియర్ జిందగీ టీజర్ కూడా వచ్చేసింది. సముద్రంతో కబాడీ ఆడుకుందామా అని ఆలియాతో షారూక్ అనడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అదెలాగబ్బా అనుకునేంతలోనే.. ఆడేసి చూపిస్తాడు మన హీరో. ఆ వెంటనే హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే ఓ ఫన్నీ ఎపిసోడ్. స్వేచ్ఛ కోరుకుంటున్నా అంటూ సైకిల్ పైనుంచి పడిపోయిన హీరోయిన్ ను.. నేనిప్పుడు ఫ్రీ అయిపోయా అంటూ ఆమెను వదిలేసి నవ్వుకుంటూ వెళ్లిపోయే హీరో.

విజువల్స్.. మ్యూజిక్.. టీజర్ చూస్తుంటే.. ఇది బాగా ఫీల్ బేస్డ్ మూవీ అనే విషయం అర్ధమవుతోంది. సహజంగా షారూక్ ఖాన్ సినిమాల్లో కనిపించే భారీతనం హంగామా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమా తీసిన గౌరిషిండే డైరెక్టర్ కావడంతో.. మూవీపై అంచనాలు బాగానే ఏర్పడుతున్నాయి. రిలీజ్ కి మరో ఐదువారాల గడువు ఉండడంతో.. ఈ హంగామా బాగానే ఉండొచ్చు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News