పిలిచి టిక్కెట్లు ఇస్తున్నారట..

Update: 2018-05-08 06:03 GMT
నలుగురు చూసే ఈవెంట్స్ అంటే అందుకు కాస్త గ్లామర్ డోస్ తగిలించాలి. అలాగే సెలబ్రెటీల కలర్ ని కూడా యాడ్ చేయాలి. అదే తరహాలో స్పోర్ట్స్ ఈవెంట్స్ లలో నిర్వాహకులు బాగా కవర్ చేస్తుంటారు. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ కోసమని కూడా మొదట నిర్వాహకులు ప్రతి టీమ్ కు చెందిన స్థానిక సెలబ్రెటీలను రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఐపీఎల్ కి ఫుల్ సపోర్ట్ ఉంది.

బెంగుళూర్ - కోల్ కతా అలాగే ముంబై వంటి జట్లకు సంబంధించిన స్పెషల్ సినిమా సెలబ్రెటీలు వస్తుంటారు. దీంతో ఎంతో కొంత అభిమానులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే హైదరాబాద్ జట్టుకు మాత్రం లోకల్ సెలబ్రెటీల నుంచి అనుకున్నంత రేంజ్ లో క్రేజ్ దక్కడం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ పెద్దగా హాజరు కావడం లేదు.  వెంకటేష్ - సుమంత్ వంటి నటులు రెగ్యులర్ సన్ రైజర్స్ కి మద్దతు ఇస్తున్నారు. అప్పట్లో జక్కన్న గ్యాంగ్ ఓ మ్యాచ్ కి వచ్చింది.

ఎవరు వచ్చినా హీరోయిన్స్ పెద్దగా రావడం లేదు. దీక్ష పంత్ - మనాలి రాథోడ్ వంటి వారు వచ్చినా పెద్దగా కలర్ఫుల్ అనిపించలేదు. ఛార్మి మెహబూబా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చింది. కాజల్ సమంత తమన్నా అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్ వస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వారి కోసం సన్ రైజర్స్ వారు స్పెషల్ గా సెలబ్రెటీల వివిఐపి టికెట్స్ ఇస్తామని ఆఫర్స్ ఇచ్చేస్తున్నారట. మరి మన హీరోయిన్స్ నెక్స్ట్ మ్యాచ్ కోసమైనా వస్తారో లేదో చూడాలి.



Tags:    

Similar News