NCB విచారణలో 'డ్రగ్ చాట్' చేసినట్లు ఒప్పుకున్న దీపికా...!

Update: 2020-09-26 11:50 GMT
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబయిలోని పోర్ట్‌ ట్రస్ట్‌ అతిథిగృహంలో ఎన్‌సీబీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9.48 గంటలకి ఆమె విచారణ కొరకు ఎన్‌సీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. గత 4 గంటలుగా కొనసాగుతున్న విచారణలో అధికారులు డ్రగ్స్ చాట్ కు సంబంధించిన ప్రశ్నలతో దీపికాను ఉక్కిరిబిక్కరి చేస్తున్నారని నేషనల్ మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఎన్సీబీ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో దీపికా పలు కీలక విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. ఇప్పటికే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ని ప్రశ్నించిన ఎన్‌సీబీ.. నేడు దీపికాతో కలిసి ఆమెను మరోసారి విచారిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ సిట్ అధికారులకు దీపికా ఇచ్చిన స్టేట్మెంట్ లో డ్రగ్ చాట్ చేసినట్లు ఒప్పుకుందని 'టైమ్స్ నౌ' ఛానల్ పేర్కొంది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు తాను మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ తో 2017 అక్టోబర్ లో డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించిందని 'టైమ్స్ నౌ' తెలిపింది. ప్రస్తుతం దీపికా రెండో రౌండ్ విచారణ జరుగుతున్న క్రమంలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, దీపికా తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ లో నిషేధిత 'మాల్' 'హ్యాష్' గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో వీరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలను తెలుసుకునే నేపథ్యంలో ఎన్సీబీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News