కేన్స్ వేదిక‌పై దీపిక సంక‌ల్పం సాధ్య‌మేనా?

Update: 2022-05-20 09:31 GMT
బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే స్టార్ స్టేట‌స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో దీపిక ఒక‌రు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనూ దీపిక స‌త్తా చాటుతుంది. హాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చింది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా  త‌న మార్క్ స్పీచ్ తో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం 75వ కేన్స్ ఫిలిం పెస్టివ‌ల్స్ కి భార‌త్ త‌రుపున జ్యూరీ స‌భ్యురాలిగా ప్రాతినిధ్యం వ‌హిస్తుంది.

తాజాగా ఈవేడుక‌ల్లో దీపిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇండియ‌న్ సినిమా మొత్తాన్ని ఒకేతాటిపై తీసుకొచ్చి ప్ర‌పంచ స్థాయిలో  భార‌తీయ సినిమా  స‌త్తా చాటేలా మాట్లాడింది. ``ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా అంతా ఏక‌మైంది. ఇంత‌కు ముందు బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..మాలీవుడ్..శాండిల్ వుడ్ అని స‌ప‌రేట్ గా ఉండేది. కానీ ఇప్పుడు అన్ని ఉడ్ లు కలిసి పాన్ ఇండియాగా అవ‌త‌రించాయి.

ప్ర‌పంచ స్థాయిలో ఇండియ‌న్ సినిమా స‌త్తా చాట‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లయ్యాయి. ఇది మంచి ప‌రిణామం` అని వ్యాఖ్యానించింది. మ‌రి దీపిక మాట‌ల్లో వాస్త‌వ‌మెంత‌? అన్న‌ది విశ్లేషిస్తే దీపిక మాట‌ల్లో కొంత వ‌ర‌కూ నిజముంది. తెలుగు సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో ఫేమ‌స్ అవుతుంది. `కేజీఎఫ్` హిట్ తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ జాతీయ స్థాయిలో ఫేమ‌స్ అయింది.

బాలీవుడ్ కంటెంట్ టాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఇక్క‌డ కంటెంట్ అక్క‌డికి వెళ్తుంది.  సౌత్ నుంచి కూడా ఇత‌ర భాష‌ల సినిమాలు అక్క‌డా..ఇక్క‌డా జంప్ అవుతున్నాయి. ఇత‌ర భాష‌ల న‌టులు అన్ని భాష‌ల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. భాషాప్ర‌యుక్త రాష్ర్టాలు గా ఏర్పాటైన త‌మిళ‌నాడు..ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య ఉన్న చిన్న‌పాటి భాషా ప‌రొపొచ్చాలు తొల‌గిపోతున్నాయి. కోలీవుడ్ స్టార్లు తెలుగులో న‌టించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు.

తెలుగు సినిమాలు త‌మిళ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక హిందీ బెల్ట్ లో తెలుగు హీరోలు అంతే ఫేమ‌స్ అవుతున్నారు. బాలీవుడ్ కి  పోటీగా ఇత‌ర భాష‌ల సినిమాలు నిలుస్తున్నాయి. బాలీవుడ్ నుంచి ఓ వ‌ర్గం వ్య‌తిరేకంగా ఉన్న‌ప్ప‌టికీ మెజార్టీ వ‌ర్గం టాలీవుడ్  స‌హా ఇత‌ర భాష‌ల్ని ప్రోత్స‌హిస్తుంది. ఇది శుభ‌ప‌రిణామం.

దీపిక చేసిన  వ్యాఖ్య‌లు వెనుక ఇలా  ఎంతో మీనింగ్ ఉంది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అంతా క‌లిసి క‌ట్టుగా ఉన్నామ‌ని చెప్పి దేశ ఔన్న‌త్యాన్ని పెంచింది. చిన్న‌పాటి విబేధాలున్న‌ప్ప‌టికీ ప‌బ్లిక్ వేదిక‌ల‌పై  అలాంటి వాటిని  హైడ్ చేసి భార‌తీయ సినిమాని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లేలా తాను చేయ‌గ‌ల్గినంత చేస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది.

అయితే ఇలా దీపిక ఒక్క‌రే ఆలోచిస్తే స‌రిపోదు. అంతా క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యాలు తీసుకుని ఆ ర‌కంగా ముందుకెళ్లిన‌ప్పుడు  ప్ర‌పంచ స్థాయిలో ఇండియ‌న్ సినిమా ఫేమ‌స్ అవుతుంది. హాలీవుడ్ త‌ర‌హాలో ఇండియ‌న్ సినిమాకి  వ‌రల్డ్ వైడ్ గా  గుర్తింపు ద‌క్కుతుంది. అప్పుడే కేన్స్ ఉత్స‌వాలు..ఆస్కార్ ఉత్స‌వాలు లాంటివి ఇండియ‌న్ సినిమా నిర్వ‌హించ‌గ‌ల‌దు. మ‌రి ఇది భార‌తీయ సినిమాకి సాధ్య‌మేనా?  కాదా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.
Tags:    

Similar News