మ‌నిషి గుండెకు క‌డుపుకు లింక్ క‌నిపెట్టిన క‌పుల్!

Update: 2020-04-09 05:30 GMT
రణవీర్ సింగ్ - దీపిక జంట సెల్ఫ్ క్వారంటైన్ నియ‌మంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ర‌ణ‌వీర్ సోష‌ల్ మీడియాలో ఓ ఫ‌న్నీ యానిమేటెడ్ ఫోటోని అభిమానుల‌కు షేర్ చేశాడు. గృహ‌నిర్భంధం నుంచి ప్రతిరోజూ తన అభిమానుల కోసం ర‌ణ‌వీర్ - దీపిక జంట ఇలాంటి ఏదో ఒక ఫోటోని షేర్ చేస్తున్నా ఇది మాత్రం సంథింగ్ స్పెష‌ల్ . తాజా యానిమేటెడ్ ఫోటో చాలా అందంగా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. ఈ యానిమేటెడ్ చిత్రంలో దీపిక - రణవీర్ మిక్కీ మౌస్ .. మిన్నీ మౌస్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. రణ్ వీర్ చేతికి దీపిక ఒక గ‌రిటె ను అందిస్తోంది. అది కాస్తా పిడి ఊడిపోయింద‌న్న‌మాట‌. ఈ ఫోటో ఎంతో ఫ‌న్నీగా ప్ర‌స్తుత స‌న్నివేశాన్ని ఎలివేట్ చేసేదిగా క‌నిపిస్తోంది. ``ఒక మనిషి గుండెకు మార్గం అతని కడుపు గుండానే ఉంటుంది`` అంటూ ఫ‌న్నీ కోట్ ని ఇచ్చాడు ర‌ణ‌వీర్. ఈ చిత్రంపై దీపిక స్పందన ఏమై ఉంటుంది? అన్న‌ది అటుంచితే.. గ‌త కొంత‌కాలంగా దీపిక - ర‌ణ‌వీర్ వేషాలు అభిమానుల్ని బాగానే అల‌రిస్తున్నాయి.

వంట వండాలి అంటే గ‌రిటె తిప్పాలి. గ‌రిటె తిప్పేందుకు ఇద్ద‌రు పోటీ ప‌డితే ఇలా ఉంటుందేమో ఆ ఆస‌న్నివేశం. ఇంట్లో నేను మాస్ట‌ర్ చెఫ్ అంటే నేను మాస్ట‌ర్ చెఫ్ అంటూ దీపిక‌తో ర‌ణ‌వీర్ కొట్లాడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. వార్డ్ రోబ్ స‌ర్ద‌డం నుండి కిచెన్ ప‌నుల వరకు ఆ ఇద్ద‌రూ క‌లిసే చేసుకుంటున్నారు.

ఆ ఇద్ద‌రూ థాయ్ వంట‌కాల్ని మెనూలో చేర్చి ఆస్వాధిస్తున్నార‌ట‌. ఇక ఈ జంట ఆర‌గించే భోజనం .. డెజర్ట్ సంగ‌తుల్ని ఫోటోల ద్వారా పంచుకుంటున్నారు. నువ్వులు.. వెల్లుల్లి తో థాయ్ సలాడ్ కూడా తిన్నారు మ‌రి. కూరగాయల తో టామ్ యమ్ సూప్ ని టేస్ట్ చేశారు. థాయ్ గ్రీన్ కర్రీస్ వండుకు తిన్నారు.కేకులు నూడిల్స్ అంటూ ర‌క‌ర‌కాల వంట‌కాలు చేసుకున్నారు. ఆ ఇద్ద‌రూ ఒక‌రి వంట‌పై ఒక‌రు ట్రోలింగ్ చేయ‌డం బోలెడంత ఫ‌న్ ని జ‌న‌రేట్ చేస్తోంది.

ఇక ఈ జంట కెరీర్ సంగ‌తి చూస్తే..  `జయేశ్ భాయ్ జోర్దార్` సెట్స్ పై ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 2 న రావాల్సి ఉండ‌గా.. వాయిదా ప‌డే ఛాన్సుంది.  83 షూటింగ్ ల‌క్కీగా ఇప్ప‌టికే పూర్త‌యింది. స్పోర్ట్స్ డ్రామా 83 లో దీపిక త‌న భ‌ర్త‌ రణ్ వీర్ తో కలిసి నటించింది. క‌రోనా వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. కొత్త తేదీని ప్ర‌క‌టించాల్సి ఉందింకా. దీపిక సంగ‌తి చూస్తే.. చివరిసారిగా ఛపాక్ లో కనిపించింది. దీపిక.. రిషి కపూర్ నటించిన `ది ఇంటర్న్` కి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.
Tags:    

Similar News