నితిన్ 'తమ్ముడు' క్రేజీ అప్డేట్..!

తాజాగా చిత్ర బృందం షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను పంచుకుంది.

Update: 2025-01-20 13:59 GMT

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న టాలీవుడ్ హీరో నితిన్.. ఈ ఏడాదిలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' మూవీని పూర్తి చేసిన నితిన్.. "తమ్ముడు" సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా చిత్ర బృందం షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను పంచుకుంది.


"తమ్ముడు" మూవీ షూటింగ్ నిరంతరాయంగా శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి పండక్కి కూడా బ్రేక్ తీసుకోకుండా, రెస్ట్ లేకుండా చిత్రీకరణ జరిపారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. హీరో నితిన్ తో సహా ఇతర ప్రధాన నటీనటులు ఈ కీలకమైన షెడ్యూల్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని చింతల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్ ను షూట్ చేసారు. అంతకముందు రామోజీ ఫిలిం సిటీలో అధిక బడ్జెట్ తో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించినట్లుగా టాక్.

దర్శకుడు శ్రీరామ్ వేణు హై క్వాలిటీతో వీలైనంత త్వరగా 'తమ్ముడు' మూవీని కంప్లీట్ చేయడానికి శ్రమిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను అందిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. అక్కా-తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితిన్ సోదరిగా సీనియర్ నటి లయ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 56వ చిత్రంగా ''తమ్ముడు'' తెరకెక్కుతోంది. దిల్ రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 2025 మహా శివరాత్రి స్పెషల్ గా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.

ఇకపోతే ఎస్వీసీ సంస్థతో హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో 'దిల్', 'శ్రీనివాస కళ్యాణం' వంటి సినిమాల్లో నితిన్ హీరోగా నటిస్తే.. శ్రీరామ్ వేణు 'ఎంసీఏ' 'వకీల్ సాబ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న 'తమ్ముడు' సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోందని మేకర్స్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు నితిన్ హీరోగా నటిస్తున్న 'రాబిన్ హుడ్' మూవీని మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News