పార్లమెంటు నాల్గవ దశ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అక్షయ్ కుమార్, ఆలియాభట్, కత్రీనా కైఫ్ వంటి కొందరు స్టార్స్ ఓటు వేయలేదు. ఎందుకంటే వారికి అసలు ఇండియాలో ఓటే లేదు. వారు అంతా కూడా విదేశీ పాస్ పోర్ట్ తో ఇండియాలో ఉంటున్నారు. అందువల్ల వారికి ఇండియాలో ఓటు లేదు. వారు కావాలనుకుంటే విదేశీ పాస్ పోర్ట్ ను రద్దు చేసుకుని ఇండియాలో ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చు. కాని వారు మాత్రం విదేశీ పాస్ పోర్ట్ ను వదులుకునేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే ఇదే బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే మాత్రం తన విదేశీ పాస్ పోర్ట్ ను రద్దు చేయించుకుని ఇండియాలో ఓటు వేసింది.
డెన్మార్క్ లో పుట్టిన దీపిక పదుకునేకు అక్కడి పౌరసత్వం ఉండేది. ఆమె చాలా కాలం పాటు ఇండియాలో డెన్మార్క్ పాస్ పోర్ట్ పై ఉంది. సినిమాలకు వచ్చిన కొత్తలో ఆమె విదేశీ పౌరసత్వంనే కలిగి ఉంది. ఇప్పటికి కూడా దీపిక డెన్మార్క్ పౌరసత్వంను కలిగి ఉందని అంతా భావించారు. కాని తాజాగా ఆమె ఓటు వేయడంతో గత కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. ఎప్పుడో కాని దీపిక తన డెన్మార్ పౌరసత్వంను రద్దు చేసుకుని ఇండియన్ సిటిజన్ అయ్యింది. అందుకే ఆమె ఇండియాలో ఓటు హక్కును వినియోగించుకోగలిగింది.
దీపిక తో పాటు ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇతర స్టార్స్ తో పోల్చితే దీపిక పదుకునేను అభినందించాలి. ఎందుకంటే బాధ్యత యుతంగా తాను ఇండియాలో ఉంటున్నందుకు ఇక్కడి పౌరసత్వంను తీసుకుని, బాధ్యత యుతంగా ఓటును కూడా వేసి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఈసారి ఓటు వేయని వారు వచ్చే ఎన్నికల్లో అయినా ఓటు వేయాలని ఆశిద్దాం.