ఏకకాలంలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలతో దీపిక హల్ చల్ ఇండస్ట్రీలో ఒక రేంజులో చర్చకొస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న ఈ భామ తదుపరి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సరసన ఫైటర్ లాంటి భారీ మల్టీస్టారర్ లో నటించాల్సి ఉంది. అలాగే మరో రెండు భారీ చిత్రాలకు దీపిక సంతకాలు చేసిందని సమాచారం.
ఇటీవలే సీనియర్ నటుడు అనీల్ కపూర్ తో కలిసి దీపికా పదుకొణె ఫైటర్ షూటింగ్ కోసం అస్సామ్ బార్డర్ కి జంప్ అయిపోయిందని తెలిసింది. అయితే ఫైటర్ కోసం భారీ కాల్షీట్లను కేటాయించిన దీపిక ప్రభాస్ కి అన్యాయం చేస్తోందా? అంటూ ఇప్పుడు అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ - నాగ్ అశ్విన్ జోడీ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే 2023లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. దేశంలోనే మునుపెన్నడూ ఎవరూ టచ్ చేయని అరుదైన కాన్సెప్టుతో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక కూడా ప్రభాస్ కి ధీటుగా యాక్షన్ క్వీన్ గా కనిపించనుందని గుసగుసలు వినిపించాయి. తన పాత్రకు హీరో పాత్రతో సమానమైన ప్రాధాన్యతను కల్పించారట. అందుకే దీపిక ప్రభాస్ తో సమానంగా పారితోషికం చెల్లించాలని పట్టుబట్టినట్టు అప్పట్లోనే కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు ప్రాజెక్ట్ కే కాల్షీట్లను మ్యానేజ్ చేస్తూనే ఫైటర్ కోసం దీపిక భారీ కాల్షీట్లను కేటాయించిందని తెలిసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఫైటర్ లో ఒక కీలక పాత్రలో కనిపించనుండడంతో తనతో కలిసే దీపిక సెట్స్ పైకి వెళుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కోసం హృతిక్ రోషన్ సహా దీపికా పదుకొణె- అనీల్ కపూర్ ఇరువురూ అస్సాంలోని తేజ్ పూర్ కు వెళుతున్నారని తాజాగా తెలిసింది.
ఈ వారం ప్రారంభంలో ఫైటర్ చిత్రీకరణ ప్రారంభమైందని హృతిక్ రోషన్ స్వయంగా ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం కపూర్ ప్రైవేట్ వానిటీ వ్యాన్ ఇప్పటికే 4 కార్ప్స్ తేజ్ పూర్ ఆర్మీ ప్రాంతంలోని ప్రదేశానికి చేరుకుంది. ఈ చిత్రంలో దీపిక పాత్ర వెయిట్ ఎంత? కపూర్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు? అన్నదానికి ఇంతవరకూ లీకులేవీ అందలేదు. ఫైటర్ లో తన పాత్ర గురించి దీపిక కానీ అనీల్ కపూర్ కానీ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. ఈ సినిమా భారతీయ సాయుధ దళాల పరాక్రమం త్యాగం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోందని ఒకే ఒక్క హింటు తప్ప పాత్రల గురించి ఎలాంటి లీకులు అందలేదు.
ఫైటర్‌కి వయాకామ్ 18 స్టూడియోస్ - మార్ఫ్లిక్స్ బడ్జెట్ పరంగా మద్దతునిస్తున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్- జ్యోతి దేశ్ పాండే- అజిత్ అంధరే- మమతా ఆనంద్- రామన్ చిబ్- అంకు పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫైటర్ 25 జనవరి 2024న విడుదల కానుంది. ఈ సినిమా కోసం దీపిక చాలా ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోంది. గ్రీక్ గాడ్ హృతిక్ సరసన తొలిసారి అవకాశం దక్కినందుకు బోలెడంత ఉబ్బితబ్బిబ్బవుతోంది. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విక్రమ్ వేదలో నటనకు మంచి పేరు తెచ్చుకున్న హృతిక్ వెనువెంటనే మరో అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు.
ఇక హృతిక్ తో సై అనేందుకు దీపిక ఎంతో ప్రిపరేషన్ తో రెడీ అయిపోయింది మరి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం దర్శకనిర్మాతలు సంప్రదించినప్పుడు బోలెడంత బెట్టు చేసిన దీపిక ఫైటర్ కోసం వెంటనే కాల్షీట్లు కేటాయించింది. ఇక దీపిక వ్యవహారంపై ప్రభాస్ అభిమానులు ఎప్పుడూ సంతృప్తిగా లేరు. సోషల్ మీడియాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మేల్ డామినేటెడ్ ప్రపంచాన్ని దీపిక తీసికట్టుగా చూసే తీరు కూడా కొందరికి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు తన నడవడికపై ఫ్యాన్స్ రకరకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.