నిన్నలా చూడలేను రణ్ వీర్

Update: 2018-06-25 10:10 GMT
పద్మావత్ సినిమాలో విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేశాడు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. వరస హిట్లతో జోరుమీదున్న ఈ హీరోకు యూత్ లో క్రేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో అతడి ఫొటో కనిపిస్తే లైకులు - కామెంట్లు బోలెడు కనిపిస్తాయి. అలాంటిది రణ్ వీర్ ఫొటో ఒకటి చూడలేనంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ దీపిక పదుకునే అనడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

రణ్ వీర్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అకౌంట్ లో చిన్ననాటి ఫొటో ఒకటి షేర్ చేశాడు. అందులో డిఫరెంట్ హెయిర్ కట్ తో కొత్తగా కనిపిస్తాడు. తను చిన్ననాటి నుంచి ఎక్స్ పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాననే అర్ధం వచ్చేలా ‘అవంత్‌ గార్డే సిన్స్‌ 1985’ అంటూ కామెంట్ యాడ్ చేశాడు. రణ్ వీర్ చిన్ననాటి ఫొటోను చాలామంది లైక్ చేయగా.. అతడిని ఆ అవతారంలో చూడలేకపోయింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అందుకే నోఓఓఓఓ అంటూ కామెంట్ రాసి సింబాలిక్ ఎమోజీ పెట్టింది.

రణ్ వీర్ - దీపికా పదుకునే చాలా కాలంగా ప్రేమ పక్షుల్లాగే తిరుగుతున్నారు. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం చాలాసార్లు బయటపడింది. ఈ ఏడాది నవంబర్ లో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుందనే న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి టైంలో రణ్ వీర్ ఫొటోపై దీపిక రియాక్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది.



Tags:    

Similar News