ఫోటో స్టోరి: రెడ్ డిప్స్.. గ్లామర్ కిక్స్

Update: 2018-01-30 05:53 GMT
ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ బ్యూటీ ఎవరు అనే ప్రశ్న ఎదురైతే.. ముక్త కంఠంతో అందరూ చెప్పే మాట దీపికా పదుకొనే అనే. హాలీవుడ్ కు వెళ్లిపోయి ప్రియాంక బాలీవుడ్ పై శీతకన్ను వేస్తే.. దీపికా మాత్రం అక్కడ సినిమా చేసినా.. ఇక్కడివాటికే ప్రాధాన్యత ఇచ్చి తన రేంజ్ పెంచేసుకుంది. తాజాగా విడుదల అయిన పద్మావత్ చిత్రం సాధించిన ఘనవిజయం ఇందుకు సాక్ష్యం. అస్సలు ప్రమోషన్ చేయకుండానే ఏ స్థాయి విజయాన్ని అందుకుంటోందో చూస్తున్నాం.

ఇంతటి టాప్ బ్యూటీకి గ్లామర్ ఎగ్జిబిషన్ విషయంలో పెద్దగా మొహమాటాలు ఉండవు. ఆ స్థాయికి చేరుకోవడానికి అది కూడా ఒక రీజన్ అయినా.. అక్కడి వరకూ వెళ్లాక కూడా తన హాట్నెస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు డిప్స్. ఇక ఫోటో సెషన్స్ కోసం అయితే దీపిక చెలరేగిపోతూ ఉంటుంది. వోగ్ ఇండియా మ్యాగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కోసం దీపికా పదుకొనే ఫోటో షూట్ చేయగా.. రెడ్ కలర్ డ్రెస్ లో అందాల మోత మోగించేసింది దీపికా. రెడ్ అండ్ బ్లాక్ థీమ్ తో డిజైన చేసిన ఈ మోడర్న్ వేర్ కే అందం అద్దేసింది దీపిక. షార్ట్ లెంగ్త్ కావడంతో అందాలన్నీ తెగ మెరిసిపోతున్నాయి.

మరోవైపు రెండు చేతులు పైకి ఎత్తి దీపికా పదుకొనే ఇచ్చిన పోజుకే సౌందర్యప్రియులు తెగ ముచ్చట పడిపోతున్నారు. దీపిక అభిమానులు కూడా ఈ అందాల విందును చూసి ఇప్పుడు ఆరాధకులుగా మారిపోతున్నారు.


Tags:    

Similar News