12 కోట్లు కావాలి.. ఫిక్సుడ్ రేట్

Update: 2017-07-06 09:59 GMT
మన సినిమాలులలో ఎక్కువ పారితోషకం తీసుకుంటుంది హీరో అనే చెప్పాలి. ఇప్పటికీ మన జనాలు ఎక్కువమంది హీరో పోస్టర్ చూసే సినిమాకు వస్తారు. కాబట్టి హీరో మార్కెట్ ఎక్కువ ఉంటే అతనికి ఎక్కువ మొత్తంలో చదివించవలిసి వస్తుంది. ఆ తరవాత మిగతా మార్కెట్ విలువబట్టి వారి వారికి వాళ్ళ సొమ్ము అందుతాయి అనుకోండి. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు ఒక సినిమాకు అడుగుతున్న సొమ్ము చూస్తుంటే ఒక సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్నాయి అనుకొక తప్పదు.

బాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉన్న దీపికా పదుకొనే ఇప్పుడు ఎక్కువ  పారితోషకం తీసుకుంటున్న నటిలో ఒకరు. హీరోయిన్ రోల్ నుండి సూపర్ హీరోయిన్ రోల్ కు వచ్చిన ఈ సుందరి.. కొందరు టాప్ హీరోలకు సమానంగా వసూల్ చేస్తోందట. సంజయ్ లీలా భన్శాలి డైరెక్ట్ చేస్తున్న పద్మావతి సినిమాతో  దీపికా మరింత ఎక్కువ చార్జ్ చేస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం సుమారుగా 220 రోజుల డేట్స్ ఇచ్చిందిట. ఈ సినిమా కోసం కొన్ని ఖాన్ హీరోల ప్రొజెక్ట్స్ కూడా పక్కన పెట్టింది కాబట్టి.. అమ్మడు ఏకంగా 12 కోట్లు తీసుకుందని టాక్.

అయితే ఈ 12 కోట్లు రేట్ టాగ్ పద్మావతి సినిమా నుండే మొదలుపెట్టి.. వచ్చే తదుపరి సినిమాలకు కూడా ఇదే ఫిగర్ చెబుతోందట. ఈ మధ్యనే ఒక యంగ్ హీరో సినిమా కోసం ఎప్రోచ్ అయితే.. బేరాలు ఏమి ఉండవు ఇక్కడ ఫిక్సెడ్ రేట్ అని చెప్పేసిందిటలే. ఆమె తోటి హీరోయిన్లు వాళ్ళ మార్కెట్ ఎంతో ఒక సినిమాకు ఎంత తీసుకోవలో తేల్చుకోలేని స్థితి లో ఉంటే దీపికా మాత్రం తన ఫీ ఇంతే అని ఖచ్చితంగా చెబుతోంది. దీనినే డిమాండ్ అంటార్లే.


Tags:    

Similar News