అంత ముట్టిందని ఒప్పేసుకుంది!!

Update: 2018-01-25 17:08 GMT
దీపికా పదుకొనే నటించిన మూవీ పద్మావత్ థియేటర్లలోకి వచ్చేసింది. రివ్యూలతో పాటు మౌత్ టాక్ కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ను అవాయిడ్ చేసిన పద్మావత్ టీం.. రిలీజ్ సమయానికి మాత్రం యాక్టివ్ అయింది. పద్మావతి పాత్రధారిణి అయిన దీపిక.. స్వయంగా కొన్ని టీవీషోలకు అటెండ్ అవుతోంది.

ప్రచారంలో భాగంగా ఓ టీవీ షోకి తన సోదరి అనీషాతో కలిసి వచ్చిన దీపికా పదుకొనే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఈ సినిమా గురించి ముందు నుంచి వస్తున్న కొన్ని రూమర్స్ కు నేరుగానే సమాధానం ఇచ్చింది. ఈ షో నిర్వహిస్తున్న నేహా ధూపియా.. 'పద్మావత్ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారు' అని అడిగేసింది. ఆ క్వశ్చన్ అడిగిన రౌండ్ ప్రకారం.. అయితే ఆన్సర్ ఇవ్వాలి.. లేదా ఒంటిపై ఉన్న ఏదో ఒక వస్తువు తొలగించాలి. తన ఇయర్ రింగ్స్ తీసి టేబుల్ పై పెట్టేసిన దీపిక.. ఎంత సొమ్ము అందుకుందో వెల్లడించనని చెప్పకనే చెప్పింది.

అయితే.. ఆ తర్వాతి ప్రశ్నగా పద్మావత్ లో నటించిన ఇద్దరు హీరోల కంటే మీరే ఎక్కువ తీసుకున్నారట కదా అనే ప్రశ్నకు మాత్రం.. అవును అని ఆన్సర్ ఇచ్చింది దీపికా పదుకొనే. పద్మావత్ చిత్రంలో కొంత సేపు ఆ పాత్ర కనిపించకపోయినా.. సినిమా చూసిన వారికి ఆమె పడిన కష్టం అర్ధమవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో దీపిక జీవించేసిన తీరుకు.. ఎంతిచ్చినా తప్పులేదని అనిపించడం ఖాయం.


Tags:    

Similar News