సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ జెఆర్సీ కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దర్శకుడు క్రిష్ .. మారుతి .. హరీశ్ శంకర్ .. గోపీచంద్ మలినేని గౌరవ అతిథులుగా వచ్చారు.
ఈ వేదికపై 'రిపబ్లిక్' దర్శకుడు దేవ కట్టా మాట్లాడాడు. "ముందుగా నేను పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ .. మీరు తేజ్ కోసం .. మా కోసం ఈ ఈవెంట్ కి రావడం వలన ఇది గ్రాండ్ సక్సెస్ ఫుల్ ఈవెంట్ అయింది. తేజ్ పై అభిమానంతో ఇక్కడికి వచ్చినవారికి, ఆయనతో సినిమాలు చేసి, ఆ సాన్నిహిత్యంతో ఇక్కడికి వచ్చిన దర్శకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇక్కడికి వరకూ రావడానికి కారణం తేజ్.
ఒకసారి 'జిమ్' లో తేజ్ కలిసినప్పుడు నేను కేవలం నాలో ఉన్న ఒక ఐడియా చెప్పాను. అప్పటికి నా దగ్గర కథ లేదు. నాలోని ఎమోషన్ కి ఆయన వెంటనే కనెక్ట్ అయ్యాడు. ఆ ఐడియాను మరొకరికి చెప్పే అవకాశం కూడా ఆయన నాకు ఇవ్వలేదు. 'సార్ ఈ కథ నాతోనే చేస్తానని ప్రామిస్ చేయండి' అన్నాడు. 'ప్రస్థానం' తరువాత చేసిన తప్పుల వలన ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది. అలాంటి సమయంలో తేజ్ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం వలన, నేను ఆయనకి మాట ఇచ్చాను. అప్పటి నుంచి ఆయన ఈ సినిమాను ఒక సైనికుడిలా కాపాడాడు.
అలాంటి నా బ్రదర్ తేజ్ .. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ సినిమా కథ చెప్పిన తరువాత నిర్మాతలు నాపై నమ్మకంతో వదిలేశారు. నేను ఫస్టు కాపీ చూపించేవరకూ కనీసం వాళ్లు ఎడిట్ రూమ్ లోకి కూడా ఎంటర్ కాలేదు. నాకు అంతటి పవర్ ను ,, స్వేచ్ఛను ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయితే అందరూ కారకులు .. ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఒక్కడిని మాత్రమే కారకుడినని చెబుతున్నాను. ఎందుకంటే పరిపూర్ణంగా నా విజన్ తో నన్ను చేయనిచ్చారు.
మణిశర్మగారి బ్యూటిఫుల్ ట్యూన్స్ ను .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పనితనం నాకు ఎంతో నచ్చింది. నా డీఓపీ .. ఆర్టు డైరెక్టర్ .. అందరూ కూడా ఎంతో అంకితభావంతో ఈ సినిమాకి పనిచేశారు. నా ఉద్దేశం ప్రకారం డైలాగ్స్ అంటే మాటల గారడి కాదు. ప్రతి మాట ఒక ఆలోచన రేకెత్తించాలి .. ఆ ఉద్దేశంతోనే డైలాగ్స్ రాశాను. ఇది థియేటర్లో వదిలిపోయే సినిమా కాదు .. మీ గుండెల్లో పెట్టుకుని ఇంటికి మోసుకుపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చారు.