డైనమైట్ సినిమా నిరాస పరిచాక అసలు అందరికంటే ఎక్కువ లాస్ అయ్యింది ఎవరంటే.. దర్శకుడు దేవ కట్టా అని ఇట్టే చెప్పొచ్చు. టైమ్ కలసిరాలేదో.. లేకపోతే బ్యాడ్ ప్లానింగో తెలియదు కాని.. మనోడు ప్రస్థానం వంటి సంచలన సినిమా తీశాక.. చాలా గ్యాప్ తరువాత ఆటో నగర్ సూర్య అనే అట్టర్ ఫ్లాపుతో పలకరించాడు. దానితో ఏకంగా డైనమైట్ అనే రీమేక్ తీసుకోవాల్సి వచ్చింది. మరి అదీ ఫ్లాపే. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి అంటే.. ఆ మధ్యన విక్టరీ వెంకటేష్ కోసం సినిమా చేస్తున్నాడని చెప్పారు. కాని అవేమీ వర్కవుట్ అయినట్లు లేవు.
అప్పట్లో ప్రస్థానం సినిమా తరువాత తదుపరి సినిమా తీయడానికి ముందుగా ఒక డైలాగ్ సౌండ్ టీజర్ ను రెడీ చేశాడు దేవ కట్టా.. 'అవును.. నేను అనాధనే.. కాని అనామకుడిని కాదు' అంటూ ఒక డైలాగ్ ను రికార్డు చేసి.. దానికి సంగీత దర్శకుడు మహేష్ శంకర్ తో మ్యూజిక్ కొట్టించి.. సంచలనానికి తెరతీశాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కు కూడా ఆ కథను చెప్పి.. చివరకు చైతూ తో సినిమా తీశాడులే. ఇక ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇదే రూటును ఫాలో అవుతున్నాడు.
మరోసారి ఇప్పుడు ''మహా ప్రస్థానం'' అనే టైటిల్ తో ఈసారి విలన్ వాయిస్ ఒకటి ఇచ్చాడు. ఆ క్యారెక్టరైజేషన్ విలన్ ది అంటున్నాడు. అప్పట్లో డైలాగ్ టీజర్ కు వచ్చినంత కిక్ ఇప్పుడు రాలేదు కాని.. ప్రయత్నం మాత్రం కొత్తగానే ఉంది. చూద్దాం ఈసారి ఎవరితో తీస్తాడో మరి.