బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు చూశాడు దేవాకట్టా. వెన్నెల - ప్రస్థానం లాంటి వైవిధ్యం ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దేవా ఇటీవలి కాలంలో రెండు వరుస పరాజయాల్ని చవిచూడాల్సి వచ్చింది. టెక్నికల్ గా బావున్నాయ్. ఏదో తేడా కొట్టింది అన్న విమర్శ వచ్చింది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు.. దేవా ఎంత ట్యాలెంటెడ్ ఫెలో అయినా అతడిని దురదృష్టం నీడలానే వెంటాడుతోంది.
ఇలాంటి స్ర్టగుల్ నుంచే బోలెడంత నేర్చుకుని రామ బాణంలా దూసుకొస్తానని అతడు ఇప్పటికీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. అందుకు ఇప్పుడు పూర్తిగా మరో ఎటెంప్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే కమర్షియాలిటీ పేరుతో రూటు మార్చి దెబ్బ తిన్న దేవా తను నమ్మిన గత సిద్ధాంతాన్నే ఈసారి తెరపైకి తీసుకొస్తున్నాడు. అధికారం - రాజకీయవారసత్వం - డబ్బు కుటుంబాల్ని - అనుబంధాల్ని సర్వనాశనం ఎలా చేస్తాయో ప్రస్థానంలో చూపించాడు. ఎమోషన్ ని పీక్స్ లో ఎలా చూపించాలో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. అందుకే ఇప్పడు మరోసారి పవర్ - రాజకీయం అనే కాన్సెప్టుతోనే మరో కథ రెడీ చేశాడు.
అయితే ఇది ప్రస్థానంకి సీక్వెల్ కాదు. కొనసాగింపు కథ కాదు. కొత్తగా ఉంటుంది. పవర్ బేస్డ్ లైన్ మాత్రమే. మహాప్రస్థానం అని టైటిల్ పెట్టుకున్నా... అదే ఫైనల్ కాదని చెబుతున్నాడు. నిరాశ పడలేదు. తప్పుల్ని పదే పదే నెమరు వేసుకుంటున్నా. ఆశ చావనివ్వను. ఎదురీదుతాను.. అని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు. ప్రస్తుత స్ర్కిప్టు కోసం ఓ సీనియర్ హీరో - మరో యంగ్ డైనమిక్ హీరో కోసం ఎదురు చూస్తున్నా. కన్నడ - మలయాళ నటులు అయినా ఫర్వాలేదు.. అని చెబుతున్నాడు.
అతడి ఎంపికల్ని బట్టి ఈసారి కథని - కంటెంట్ ని - ఎమోషన్ ని నమ్మి నటులు ఎవరు అనేది ఆలోచించకుండా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడని అర్థమవుతోంది. చూద్దాం మరి ఏం చేస్తాడో.