మీకు గుర్తుందా గతేడాది స్టయిలిష్ స్టార్ బన్నీ ఒక షార్టు ఫిలింతో వచ్చాడు. మనోడు భారతదేశ స్వాతంత్ర్యదినోత్సవం పురస్కరించుకొని ''ఐ యామ్ ఫర్ ఛేంజ్'' అనే లఘు చిత్రంతో సందడి చేశాడు. అసలు సమాజంలో మార్పును కోరుకునే జనులందరూ ముందుగా తమని తాము మార్చుకోవాలని, ఆ తరువాత పది మందికీ మార్గదర్శకాలు చెప్పాలని చెప్పకనే చెప్పాడు బన్నీ. ఆ సినిమా ప్రభావం టాలీవుడ్ పై బాగానే పడింది. అప్పటినుండి మన దర్శకులు కూడా అలాంటి సందేశాత్మక సినిమాలు ఎక్కువగానే చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు 2015 ఇండిపెండెన్సు డే వస్తోంది కాబట్టి, ఈసారి మరొకరు అలాంటి ప్రయోగం చేస్తున్నారు.
తన పాప్ పాటలతో తెలుగువారిని ఉర్రూతలూగించిన గాయని స్మిత. ఆ మధ్యన సినిమాల్లో నటీమణిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని చివరకు సినిమాలను వదిలేసి డివోషనల్ ఆల్బమ్స్ చేసుకుంటోంది ఈవిడ. ఇకపోతే మొన్న ఎలక్షన్లలో బిజెపి తరుపున ప్రచారం కూడా చేసిందిలే. అయితే ఇప్పుడు మాత్రం ఒక సందేశాత్మక షార్ట్ ఫిలింతో వస్తోంది. అప్పట్లో బన్నీ సినిమాను సుకుమార్ తీస్తే, ఇప్పుడు , స్మిత సినిమాను దేవ కట్టా తీశాడు. రేపు సాయంత్రం ఈ లఘు చిత్రం విడుదలవుతుందట. అసలే ఈ మధ్యన సినిమాలేవొచ్చినా రాజకీయ నాయకులు కూడా తెగ చూసేస్తున్నారు కాబట్టి, ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం అంటే పొలిటికల్ సర్కిల్సులో కూడా విశేష ఆదరణ పొందే ఛాన్సుంది.