జూనియర్ డాక్టర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన దర్శకుడు

Update: 2020-06-11 08:50 GMT
‘ప్రస్థానం’ సినిమా దర్శకుడు దేవా కట్టా తాజాగా గాంధీలో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల ఆవేదన భరిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది క్షేత్రస్థాయిలోని నిజమైన పరిస్థితి అంటూ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ పై పోరాడుతున్న గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడికి నిరసనగా తాజాగా గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. వారి ఆందోళన వీడియోను దర్శకుడు దేవా కట్టా ట్వీట్టర్ లో షేర్ చేశారు. కరోనా పాజిటివ్ రోగులతో కలిసి పనిచేసే ముప్పును ఎదుర్కొంటున్న వైద్యులు - వైద్య సిబ్బందిని దాడులతో భయపెట్టడం కరెక్ట్ కాదని అందులో జూనియర్ డాక్టర్లు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వీడియోలు - ట్వీట్లు మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జూనియర్ డాక్టర్లు వైరల్ చేస్తున్నారు.. ఈ నిరసనలో జోక్యం చేసుకుని వైద్యుల జీవితాలు  కాపాడాలని నినదిస్తున్నారు.

వీరి నిరసనకు మద్దతు తెలిపిన దర్శకుడు దేవాకట్టా ‘ ఇది క్షేత్రస్థాయిలో నిజమైన పరిస్థితి’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 
Full ViewFull View
Tags:    

Similar News