మైఖేల్‌ జాక్సన్‌ డూప్‌ లా తయారైన దేవిశ్రీ

Update: 2018-12-27 17:09 GMT
టాలీవుడ్‌ లో దేవిశ్రీ ప్రసాద్‌ కు తిరుగేలేదు. తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ తో దూసుకుపోతున్నాడు. తెలుగు - తమిళ్‌ అనే తేడా లేకుండా రెండు భాషల్లో వాయించేస్తున్నాడు. మనోడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో పాటు మంచి డ్యాన్సర్‌. అన్నింటికి మించి ఫిట్‌ నెట్‌ ఫ్రీక్‌. ఫిజిక్‌ పై ఫుల్‌ కంట్రోల్‌ ఉంటుంది. ఫిజిక్‌ పై అద్భుతమైన శ్రద్ధ తీసుకునే దేవిశ్రీ.. ఇప్పుడు తన హెయిర్‌ స్టైల్‌ తో అందర్ని ఆకర్షిస్తున్నాడు. 80ల్లో మైఖేల్‌ జాక్సన్‌ హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో.. సేమ్‌ అలాంటి హెయిర్‌ స్టైల్‌ నే మెయింటైన్ చేస్తున్నాడు. వినయ విధేయ రామ ఆడియోకు వచ్చిన దేవిశ్రీ హెయిర్‌ సైల్‌ ని చూస్తే అందరికి అలాగే అన్పించింది.

 మొదటి నుంచి హెయిర్‌ స్టైల్‌ - కాస్ట్యూమ్స్‌ విషయంలో దేవిశ్రీ ఒక అడుగు ముందే ఉంటాడు. తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్లలో స్లిమ్‌ గా - ఫిట్‌ గా ఉండేది దేవీనే. ట్రెండ్‌ కు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కాస్ట్యూమ్స్‌ అన్నీ మార్చే దేవిశ్రీ .. హెయిర్‌ స్టైల్‌ జోలికి మాత్రం వెళ్లడు. కొంతమంది మైకేల్‌ జాక్సన్‌ ని ఫాలో అవుతున్నాడని అంటుంటే.. ఇంకొంత మంది మాత్రం కర్నూలు బాలసాయిబాబా లేని లోటుని తీరుస్తున్నాడని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ విషయం దేవిశ్రీ చెవిన పడిందో లేదో.
Tags:    

Similar News