హద్దులు దాటిపోయావ్ దేవిశ్రీ.

Update: 2015-07-19 13:58 GMT
ఈ మధ్య కమెడియన్ ఆలీకి స్టేజ్ మీద మైకివ్వాలంటే జడుసుకుంటున్నారు జనాలు. నోరు తెరిస్తే చాలు బూతులే బూతులు. ఎవరితో మాట్లాడుతున్నాం. ఎక్కడ మాట్లాడుతున్నాం.. ఎవర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అని చూసుకోకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో చికాకు పుట్టిస్తున్నాడు ఆలీ. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో అతను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. త్రివిక్రమ్ సహా అందరూ తలదించుకునే పరిస్థితి కల్పించాడు ఆలీ. ఆ దెబ్బతో ఆలీని ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా పిలవడానికి జనాలు భయపతున్నారు. ఐతే ‘శ్రీమంతుడు’ ఆడియో ఫంక్షన్లో ఆలీ లేని లోటును దేవిశ్రీ ప్రసాద్ తీర్చేశాడు. సుమతో కలిసి ఆలీ యాంకరింగ్ చేసిన వీడియోల్ని చూసి స్ఫూర్తి పొందాడో ఏంటో.. దారుణమైన డబుల్ మీనింగ్ మాటలతో చిరాకు పుట్టించాడు.

శ్రుతి హాసన్‌ ను వేదిక మీదికి పిలిచి పాట పాడించాలనుకున్న దేవిశ్రీకి ఎందుకోగానీ.. ఆమె బ్యాక్ మీద కన్ను పడింది. మీడియా వాళ్లందరూ ఎంతసేపూ హీరోయిన్ల బ్యాక్ లే చూపిస్తుంటారని.. శ్రుతి హాసన్ బ్యాక్ కంటే కూడా ఫ్రంట్ బావుంటుందని దారుణమైన కామెంట్ చేశాడు దేవి. శ్రుతిని వేదిక మీదికి పిలిచి పాట పాడించిన దేవి.. ఆమె వెళ్తుండగా.. ‘‘నీ డ్రెస్ చాలా బాగుంది. మోర్ ఫ్రమ్ ద బ్యాక్’’ అంటూ ఇంకో కామెంట్ చేశాడు. శ్రుతి ఈ ఫంక్షన్‌ కు బ్యాక్ మొత్తం ఓపెన్ గా ఉండే డ్రెస్సుతో రావడం విశేషం. ఇంతకుముందెప్పుడూ దేవిశ్రీ ఇలాంటి కామెంట్లు చేసింది లేదు. ఫంక్షన్ కు వచ్చేముందు ఆలీనేమైనా కలిసి వచ్చాడో ఏమో కానీ.. ఈసారి మాత్రం బాగా హద్దులు దాటేశాడు.
Tags:    

Similar News