ప్యారిస్ నగరం అట్టుడికింది. ఉగ్రవాదుల నరమేధంతో అల్లాడిపోయింది. దాదాపు 140 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ వార్త ఈ రోజు ఉదయమే అంతర్జాలాన్ని ఊపేసింది. ప్రపంచ దేశాల్ని గడగడ లాడించింది. ఈ దాడితో ప్యారిస్ ఒణికిపోయింది. ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలను ఇళ్లలోంచి రాకుండా 144 సెక్షన్ నడుస్తోందిప్పుడు. సరిగ్గా ఇది ఇండియాలో జరగబోతున్న ఓ ప్లాటినం డిస్క్ మ్యూజిక్ లైవ్ షోపై ప్రభావం చూపించడం.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్.
ఇట్ మీన్స్.. తన సంగీతంతో ప్రేక్షకాభిమానుల్ని - ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న దేవీ శ్రీప్రసాద్ కి ఈ ఉగ్రదాడి ఊహించని ఝలక్ ఇచ్చింది. దేవీ శ్రీ ఇటీవలి కాలంలో మణిశర్మ బాటలోనే విదేశీ పర్యటనలు - మ్యూజిక్ లైవ్ షోలతో బిజీ స్టార్ అయిపోయాడు. అప్పట్లో అమెరికా - లండన్ వంటి నగరాల్ని తన గానా కచేరీతో అల్లాడించాడు. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని ఉర్రూతలూగించాడు. అయితే సేమ్ ప్రోగ్రామ్ ని ఇండియాలో.. అందునా తెలంగాణలో చేయాలని ప్లాన్ చేసుకున్న దేవీశ్రీ ఇప్పుడు అనుకోని ఘటనతో నిశ్చేష్టుడై పోయాడని సమాచారం. ఇండియన్ సినిమాలు ఇటీవలి కాలంలో మెజారిటీ భాగం ప్యారిస్ లోనే జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ పౌరుల మరణానికి మనవంతుగా ట్రైబ్యూట్ చెప్పాలన్నదే ఆలోచన.
నిజానికి ఈరోజు నిజాంపేట్ శ్రీచైతన్య కాలేజ్ లో ఈరోజు డీఎస్ పీ లైవ్ షో ప్లాన్ చేశారు. కుమారి 21 ఎఫ్ ప్లాటినం డిస్క్ వేడుకతో పాటు డీఎస్‌పీ షోని కలిపి ప్లాన్ చేశాడు నిర్మాత సుకుమార్. కానీ ఈరోజు అనుకోని ఘటన - ప్యారిస్ నగరంపై ఉగ్రదాడి ఈ టీమ్‌ని పూర్తిగా కలచివేసిందిట. అందుకే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్యారిస్ పౌరులకు మనవాళ్లు ఇస్తున్న ట్రైబ్యూట్ ఇదన్నమాట!