అనూప్.. థమన్.. తర్వాత దేవీనే!

Update: 2019-04-02 05:53 GMT
బ్యాక్ గ్రౌండ్ ఉంటే సక్సెస్ సాధించడం సులువని చాలామందికి  ఒక కామన్ అభిప్రాయం ఉంటుంది.  కానీ అదేమీ నిజం కాదు. ఎంత బ్యాక్ అప్ ఉన్నా.. చాలా కష్టపడాల్సి ఉంటుంది.  అంతే కాదు బ్యాక్ అప్ + హార్డ్ వర్క్ కలిసినా కూడా ఒక్కోసారి టైమ్ కలిసి రాకపోతే విజయం కోసం ఎంతో ఓపిగ్గా వేచి చూడకతప్పదు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ పరిస్థితి అలాగే ఉంది.

మొదటి మూడు సినిమాలు నిరాశపరిచిన తర్వాత అఖిల్ తన నాలుగవ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసేందుకు రెడీ అవుతున్నాడు  అక్కినేని నాగార్జున స్వయంగా అఖిల్ కు హిట్ ఇచ్చే బాద్యతను అల్లు అరవింద్ చేతిలో పెట్టాడని అంటున్నారు.  ఈ సినిమాకు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు. భాస్కర్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా మంచి కథతో అరవింద్ గారిని ఒప్పించడంతో అవకాశం ఇచ్చాడట. అంతే కాదు.. ఈ కథకు అఖిల్ అయితే చక్కగా సూట్ అవుతాడనే ఉద్దేశంతో అఖిల్ కు సెట్ చేశాడట.  ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ను తీసుకున్నారట.

అఖిల్ మొదటి రెండు సినిమాలకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. మూడవ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.  అనూప్.. థమన్ తర్వాత ఇప్పుడు అఖిల్ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ పని చేస్తున్నాడు.  అఖిల్ మంచి డ్యాన్సర్ కాబట్టి దేవీ మ్యూజిక్ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.  కంతే కాకుండా దర్శకుడు భాస్కర్ కెరీర్ లో అతి పెద్ద హిట్ అయిన 'బొమ్మరిల్లు' కు సంగీతం అందించింది దేవీనే.  సో.. అల్లు అరవింద్ అంతా చూసుకొని మంచి కాంబినేషన్ సెట్ చేస్తున్నాడన్నమాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
    

Tags:    

Similar News