ఒక టెక్నీషియన్ తాను పని చేసిన సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడ్డం, ఎగ్జైట్ కావడం మామూలే. ఐతే దేవిశ్రీ ప్రసాద్ తాను పని చేసిన అన్ని సినిమాల గురించి అలా రెస్పాండ్ అయిపోడు. తాను మ్యూజిక్ చేసిన సినిమాల గురించి చాలా తక్కువే మాట్లాడతాడు దేవి. అందులోనూ తన తండ్రి పోయిన బాధలో ఉన్న దేవి.. ‘నాన్నకు ప్రేమతో’ గురించి పెద్దగా స్పందించట్లేదు. ఐతే ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండగా.. అతను చేసిన ట్వీట్లు ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. కొన్ని రోజుల కిందటే రీరికార్డింగ్ పూర్తి చేసిన దేవి.. ఆ ఎక్స్జపీరియన్స్ తో సినిమా ‘టెర్రిఫిక్’ అని చెప్పడం వారిలో ఆనందం కలిగిస్తోంది.
‘‘నాన్నకు ప్రేమతో.. సుకుమార్ తీసిన టెర్రిఫిక్ - బ్యూటిఫుల్ మూవీ. తారక్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకుతుంది’’ అని ట్వీట్ చేశాడు దేవి. ఎప్పుడూ తన మ్యూజిక్ గురించే మాట్లాడే దేవి.. ఇలా టెర్రిఫిక్ - మైండ్ బ్లోయింగ్ - బ్యూటిఫుల్ - హార్ట్ టచింగ్ లాంటి పదాలు వాడుతూ సినిమా గురించి ట్వీట్ పెట్టాడంటే.. ‘నాన్నకు ప్రేమతో’ ఎక్స్ ట్రార్డినరీగానే ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. ఎన్టీఆర్ కూడా సినిమాలో ఎమోషనల్ గా సాగే చివరి 45 నిమిషాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు. హాస్పిటల్ సీన్ గురించి.. అందులో ఎన్టీఆర్ నటన గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. మొత్తానికి ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో జనాల్లో క్యూరియాసిటీకైతే కొదవ లేదు. మరి ఈ అంచనాల్ని సినిమా ఏమేరకు అందుకుంటుందో చూడాలి.