ఆ సంగీత దర్శకుడిపై దేవిశ్రీ ప్రతీకారం!

Update: 2018-03-25 10:56 GMT
సూర్య నటించిన ‘సింగం’ సిరీస్‌ లో తొలి రెండు సినిమాల్ని తలుచుకోగానే.. ఆటోమేటిగ్గా సింగం సింగం హీ ఈజ్ నరసింహం అనే దేవిశ్రీ హమ్మింగ్ గుర్తుకొస్తుంది. ఆ రెండు సినిమాలకు తన సంగీతంతో పెద్ద బలంగా నిలిచాడు దేవి. ఆ సినిమాలకు దేవి సంగీతం ఒక ట్రేడ్ మార్క్ అయిపోయింది. అలాంటిది మూడో ‘సింగం’కు దేవిశ్రీని పక్కన పెట్టేశాడు దర్శకుడు హరి.

కారణాలేంటో తెలియదు కానీ.. దేవి చేయాల్సిన సినిమాను హ్యారిస్ జైరాజ్ తన్నుకుపోయాడు. ఈ విషయంలో దేవి అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు అప్పట్లో. ఐతే ‘సింగం-3’ సినిమా చూసిన వాళ్లందరికీ దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలిగింది. అది సినిమా ఫలితం మీదా కొంత ప్రభావం చూపింది. ఇలాంటి మాస్ సినిమాకు హ్యారిస్ క్లాస్ మ్యూజిక్ సెట్టవ్వలేదు. సినిమా రిలీజయ్యాక కానీ తాను తప్పు చేసిన విషయం దర్శకుడు హరికి అర్థం కాలేదు.

ఐతే ఇప్పుడు తన తర్వాతి సినిమాకు మళ్లీ దేవితో జట్టు కట్టేశాడు హరి. విశేషం ఏంటంటే.. ‘సింగం-3’ని తన నుంచి హ్యారిస్ తన్నుకుపోతే  అతను చేయాల్సిన సినిమాను దేవిశ్రీ తన ఖాతాలో వేసుకుని ప్రతీకారం తీర్చుకున్నాడు. దశాబ్దంన్నర కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’కి ఇప్పుడు హరి సీక్వెల్ తీస్తున్నడు. ‘సామి’కి హ్యారిస్ జైరాజ్ సంగీతాన్నందించాడు. న్యాయంగా సీక్వెల్ కు అతనే సంగీతం అందించాలి. కానీ ఆ అవకాశాన్ని దేవికి కట్టబెట్టి లెక్క సరి చేశాడు హరి. మరి ‘సింగం-3’ విషయంలో హ్యారిస్ లాగా ఫెయిలవ్వకుండా ‘సామి-2’కు తన సంగీతంతో దేవి బలంగా నిలుస్తాడేమో చూద్దాం.


Tags:    

Similar News