మల్టీస్టారర్ మూవీకి రాక్ స్టార్ ను తెచ్చారు

Update: 2018-06-09 10:21 GMT
మామూలు కథకు ఫన్ అండ్ ఎంటర్ టెయిన్ మెంట్ యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీయడం డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషాలిటీ. అతడు డైరెక్ట్ చేసిన పటాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్ సినిమాలు మూడు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి. ఇతడు డైరెక్ట్ చేసిన మూడు సినిమాలకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఇప్పుడు తొలిసారి స్టయిల్ మార్చి మల్టీస్టారర్ మొదలెట్టిన అనిల్ రావిపూడి మ్యూజిక్  డైరెక్టర్ ను కూడా మార్చాడు.

వరుణ్ తేజ్ అండ్ విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న మల్టీ స్టారర్ మూవీ రానుంది. ఈ సినిమాకు ఎఫ్2 అని టైటిల్ పెట్టారు. ఎఫ్2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఓ పెళ్లయిన వ్యక్తి... ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన బ్యాచులర్ ల జీవితాలను ఈ సినిమాలో వినోదభరితంగా చూపించబోతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ దాదాపుగా మెగా హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు.  వాటిల్లో బ్లాక్ బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. కాకుంటే యంగ్ హీరోలైన వరుణ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ లతో మాత్రం పని చేయలేదు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరుస్తూ వరుణ్ తేజ్ సినిమాకు కూడా పని చేయబోతున్నాడు.
Tags:    

Similar News