అరెరే.. ధమాకాను తొక్కేశారే!

Update: 2023-01-17 06:30 GMT
రవితేజ హీరోగా ధమాకా అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అప్పట్లో ఈ సినిమా 100 కోట్ల మార్కు కూడా దాటి ప్రస్తుతం 106 కోట్ల మార్కెట్ దగ్గర ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల 20 రోజులు గడుస్తున్న ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా రన్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా తెలుగు సహా డబ్బింగ్ సినిమాలన్నీ కలుపుకుని ఐదు సినిమాలు రిలీజ్ అయినా సరే... కొన్ని చోట్ల ధమాకా సినిమా ఇంకా నడుస్తూ ఉండడం గమనార్హం.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆ ఉన్న కొన్ని థియేటర్లలో కూడా ధమాకా ఆక్యుఫెన్సీ మాత్రం అద్భుతంగా ఉంది. ఒకవేళ సినిమాకి మరిన్ని థియేటర్లు కనుక లభించి ఉంటే వాటికి కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా వచ్చేవారని ఇప్పుడు ప్రదర్శితమవుతున్న థియేటర్ల యజమానులు చెబుతున్నారు. పండుగ సీజన్ కావడంతో దాదాపుగా షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయని పెద్ద సినిమాల వల్ల థియేటర్స్ ఇవ్వలేకపోతున్నాం.. కానీ ఎక్కువ థియేటర్స్ ఉండి ఉంటే ధమాకా సినిమాకి వసూళ్లు ఇంకాస్త ఎక్కువ వచ్చి ఉండేవని వారు కామెంట్ చేస్తున్నారు.

ఒకరకంగా చూస్తే ఇది ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ధమాకా సినిమా రొటీన్ స్టోరీ అనే మాట ముందు నుంచి వినబడింది. రొటీన్ స్టోరీ అయిన త్రినాధరావు, బెజవాడ ప్రసన్నకుమార్ ఇద్దరూ కలిసి సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లడంలో సఫలమయ్యారు. రవితేజ మార్క్ కామెడీ యాక్షన్ అలాగే శ్రీ లీల ఎనర్జీతో కూడిన డాన్సులు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

 ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభట్ల అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. గతంలో నేను లోకల్ సినిమా, సినిమా చూపిస్తా మామ లాంటి సినిమాలు కి పనిచేసిన ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాధరావు కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో పాటు సీసీ రిలియో అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం 106 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మరిన్ని థియేటర్స్ లభించి ఉంటే కలెక్షన్స్ మరింత పెరిగి ఉండేవి అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News