ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ బహిరంగంగా కలిసి కనిపించారు. విడిపోయిన తర్వాత మొదటిసారి తమ కుమారుడు యాత్ర స్కూల్ ఈవెంట్ కి హాజరయ్యారు. ``గర్వించదగిన తల్లిదండ్రులు #ధనుష్ #ఐశ్వర్య రజినీకాంత్ స్పోర్ట్స్ కెప్టెన్ గా ప్రతిజ్ఞ చేసిన వారి కుమారుడు యాత్ర ఇన్వెస్టిట్యూడర్ వేడుకకు హాజరయ్యారు!`` అని PRO రియాజ్ కె అహ్మద్ ట్వీట్ చేశారు. ఈవెంట్ తర్వాత ధనుష్ -ఐశ్వర్య వారి కుమారులు యాత్ర - లింగా వారి స్నేహితులతో కలిసి పోజులిచ్చిన ఓ ఫోటోగ్రాఫ్ ని కూడా రియాజ్ పోస్ట్ చేశాడు.
అంతకుముందు రోజు ఐశ్వర్య తన కొడుకు పాఠశాల చదువుల్లో రాణిస్తున్నారని తన పురోగతి గురించి వెల్లడిస్తూ ఎగ్జయిట్ అయ్యారు. ``రోజును ప్రారంభించడానికి ఒక మార్గం! సోమవారం ఉదయం స్కూల్ లో జరిగిన ఇన్వెస్టిచర్ వేడుకను వీక్షిస్తూ గడిపాను. నా మొదటి బిడ్డ స్పోర్ట్స్ కెప్టెన్ గా ప్రమాణ స్వీకారం చేయడం చూశాను`` అని ఐశ్వర్య ట్వీట్ చేసింది.
ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ధనుష్- ఐశ్వర్య కలిసి బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలన్న నిర్ణయాన్ని వివరిస్తూ ఈ జంట మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐశ్వర్య- నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
మంచి కోసం వ్యక్తిగతంగా మమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన గోప్యతను మాకు అందించండి! అని ధనుష్ తాజా ప్రకటనలో తెలిపారు.
వీరిద్దరూ ఇటీవల తమ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య చిత్రనిర్మాణంలో తన అభిరుచిని కొనసాగిస్తుండగా ధనుష్ జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అతను నెట్ ఫ్లిక్స్ యాక్షన్ మూవీ `ది గ్రే మ్యాన్`లో అతిధి పాత్రలో కనిపించిన తర్వాత సీక్వెల్లోనూ చేస్తాడని టాక్ వినిపించింది. ఈ మూవీకి రస్సో సోదరులు దర్శకత్వం వహించారు. ర్యాన్ గోస్లింగ్ - క్రిస్ ఎవాన్స్ పోషించిన పాత్రల మధ్య రఫ్ హౌస్ మ్యాచ్ తర్వాత ధనుష్ ఈ చిత్రంలో హిట్ మ్యాన్ పాత్రను పోషించాడు. ఫ్రాంచైజీలో భాగంగా కొనసాగుతూనే ధనుష్ ఇతర సినిమాలపైనా దృష్టి సారించాడు.
గత వారం విడుదలైన ధనుష్ తాజా చిత్రం తిరుచిత్రంబళం ప్రేక్షకులు విమర్శకులను ఆకట్టుకుంది. తిరుచిత్రంబళం బాక్సాఫీస్ కలెక్షన్ 4వ రోజు 50 కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ మూవీ కమర్షియల్ గా మెప్పించడమే గాక క్రిటికల్ గాను ప్రశంసలు అందుకుంది. తమిళనాడు లో ధనుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోందని ట్రేడ్ చెబుతోంది.