ధనుష్ కు పుట్టుమచ్చలు లెక్కపెడుతున్నారు

Update: 2017-02-28 11:41 GMT
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు - సినీ హీరో ధనుష్ మధురై కోర్టుకు హాజరయ్యారు. మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్ - మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడంటూ కోర్టు మెట్లెక్కడంతో ఆయన తానెవరన్నది నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    
కదిరేశన్ దంపతులు చెబుతున్నది అవాస్తవమంటూ   పిటిషన్ దాఖలు చేశాడు ధనుష్.  ఈ కేసు విచారణలో భాగంగానే కోర్టుకు హాజరయ్యాడు. ఇరువురు కోర్టుకు సమర్పించిన ఆధారాలు పరిశీలించారు జస్టిస్ చొక్కలింగం. అయితే కదిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో పుట్టుమచ్చలు వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ధనుష్‌ మంగళవారం ఉదయం మధురై కోర్టుకు హాజరయ్యారు.
    
నిజానికి ధనుష్ సినీరంగానికే చెందిన కస్తూరి రాజా కుమారుడిగానే అందరికీ తెలుసు. కానీ.. కదిరేశన్ దంపతులు మాత్రం ధనుష్ తమ కుమారుడు అంటూ కోర్టుకెక్కారు. మరి.. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News