అమ‌లాపాల్ విడాకుల‌కు స్టార్ హీరో కార‌ణమా?

Update: 2020-02-02 05:15 GMT
త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్‌- అందాల క‌థానాయిక‌ అమ‌లాపాల్ ప్రేమ వివాహం గురించి తెలిసిందే.   పెళ్లైన రెండేళ్ల‌కే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో విడిపోయారు. ప్ర‌స్తుతం ఎవ‌రి జీవితాలు వాళ్ల‌వి. విజ‌య్  రెండ‌వ పెళ్లి చేసుకున్నారు. అమ‌లాపాల్ మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయింది. అయితే ఆ ఇద్ద‌రూ విడిపోవ‌డానికి కార‌ణాలు మాత్రం ఏ ఒక్క‌రూ ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డించ‌లేదు.

తాజాగా వీరి బంధం వీగిపోవ‌డానికి త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కార‌ణ‌మంటూ విజ‌య్ తండ్రి ఏ.ఎల్ ఆళ్ల‌గ‌ప్ప‌న్ ఓ ఇంట‌ర్వూలో  సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు.  ధ‌నుష్ కార‌ణంగానే పెళ్లైన రెండేళ్లకే  విజ‌య్-అమ‌లాపాల్ విడిపోయార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విజ‌య్ ని పెళ్లి చేసుకున్న‌ త‌ర్వాత అమ‌లాపాల్ సినిమాల‌కు  దూరంగా ఉంటాన‌ని... భ‌ర్త చెప్పిన‌ట్లే న‌డుచుకుంటాన‌ని నిర్ణ‌యించుకుంది. కానీ ధ‌నుష్ `అమ్మా క‌ణ‌క్కు` అనే చిత్రంలో ఎలాగైనా అమ‌లాపాల్ న‌టించాల‌ని ప‌ట్టుబ‌ట్టాడుట‌.

దీంతో ఆయ‌న మాట కాద‌న‌లేక  విజ‌య్  కుటుంబ‌ స‌భ్యులు ఒప్పుకున్నారుట‌. అయితే ఆ సినిమా షూటింగ్ మొద‌లైన నాటి నుంచి విజ‌య్-అమ‌లాపాల్ మ‌ధ్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అయ్యాయ‌ని తెలిపారు. అప్ప‌టి నుంచే విజ‌య్ తో అమ‌లాపాల్ స‌రిగ్గా  ఉండేది కాద‌ని...కార‌ణం అడిగినా స‌రిగా బ‌దులు ఇచ్చేది కాద‌ని అన్నారు. దీంతో విజ‌య్ తండ్రి ఆరోప‌ణ‌లు ఇప్పుడు కోలీవుడ్‌ స‌హా టాలీవుడ్ లోనూ సంచ‌ల‌నంగా మారాయి. అమ్మా క‌ణ‌క్కు చిత్రం త‌ర్వాత అమ‌లాపాల్ వ‌రుస‌గా ధ‌నుష్ తో సినిమాలు చేసింది. `వేలై ఇల్లా ప‌ట్టాదారి`.. ఆ సినిమా సీక్వెల్ లోనూ అమ‌లాపాల్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఆ ఇద్దరి మ‌ధ్యా ఎఫైర్ ఉంద‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు రాయ‌డం సంచ‌ల‌న‌మైంది.


Tags:    

Similar News