తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మించబోతున్న ఆ సినిమా ప్రకటన తర్వాత ధనుష్.. శివ కార్తికేయన్ లు కూడా తెలుగు లో నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ముఖ్యంగా ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన చర్చ జరిగింది. ఏషియన్స్ సినిమాస్ వారి బ్యానర్ లో వీరి మూవీ ని అధికారికంగా ప్రకటించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను 2022 ప్రారంభంలోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబో సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయట.
శేఖర్ కమ్ముల సినిమా ఆలస్యం అయినా కూడా ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవ్వడం లేదు. ఇప్పటికే ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ అనే సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. విద్యా వ్యవస్థపై పోరాడే ఒక యువకుడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంకీ అట్లూరి టీమ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెలలోనే పట్టాలెక్కించబోతున్నారట. ధనుష్ తమిళ.. హిందీ.. ఇంగ్లీష్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా బిజీగా ఉన్నాడు. అయినా కూడా వెంకీ అట్లూరి చెప్పిన సర్ స్క్రిప్ట్ కు నచ్చి మెచ్చి వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కాంబో మూవీ క్యాన్సిల్ కాలేదు కాని ఆలస్యం అవ్వబోతుంది అంటూ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త టైమ్ కావాలన్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ కూడా అందుకు ఓకే చెప్పడం జరిగిందట. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ వెంకీ అట్లూరిల కాంబోలో రూపొందబోతున్న సినిమా ను వచ్చే ఏడాదిలోనే విడుదల చేయబోతున్నారు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోతున్న సినిమా 2022 ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యి 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ధనుష్ హీరోగా ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాలు రూపొందుతున్నాయి. వచ్చే ఏడాదిలో ధనుష్ నటించిన మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా అనగానే ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కాని ఇప్పుడు ఆలస్యం అవుతుండటంతో అసలేం జరుగుతుంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కమ్ముల నుండి ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందా అనేది చూడాలి.