కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ నటుడిగా గుర్తింపును అందుకున్న ధనుష్ ఇప్పుడు మెల్లమెల్లగా తెలుగు మార్కెట్లో కూడా తన రేంజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో కూడా ధనుష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సరైన సినిమా అతనికి పడడం లేదు. ఇక రాబోయే రోజుల్లో అందుకే అతను ఎక్కువగా తెలుగు దర్శకులపై ఫోకస్ చేస్తూ ఉండడం విశేషం.
తమిళ్ దర్శకులతో ఒకవైపు బిజీ బిజీగా వర్క్ చేస్తూనే ఇప్పుడు మధ్య మధ్యలో తెలుగు దర్శకులతో కూడా అతను సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉండడం విశేషం. అందులోనూ అతను మరీ బడా దర్శకులను సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులను సెలెక్ట్ చేసుకోకుండా ఎవరికైతే మంచి టాలెంట్ ఉంటుందో వారిని ఫోకస్ చేస్తూ ఉండడం విశేషం.
ఇప్పటికే తొలిప్రేమ మిస్టర్ మజ్ను చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా గుర్తింపును అందుకున్న వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేశాడు. సార్ అనే ఆ సినిమా ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. అలాగే మరో విభిన్నమైన దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఒక డిఫరెంట్ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడు. పొలిటికల్ పిరియడ్ మూవీ గా రాబోతున్న ఆ సినిమా తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలో కూడా విడుదల కాబోతోంది.
అలాగే ఇటీవల ఈ స్టార్ హీరో మరొక తెలుగు టాలెంటెడ్ దర్శకుడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా శర్వానంద్ తో ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ అని సమాచారం. శర్వానంద్ తో గతంలో శ్రీకారం అనే సినిమా చేసిన బి శ్రీకర్ బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ అందుకున్నాడు.
ఆ సినిమా మంచి కంటెంట్ తో తెరపైకి వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే అలాంటి దర్శకుడికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులోనూ ఆ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి అధికారికంగా క్లారిటీ రాబోయే అవకాశం ఉందట. అలాగే ధనుష్ మరో ఇద్దరు తెలుగుదర్శకుల కథలపై కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.