భార్య గొప్పా? మరదలు గొప్పా?

Update: 2017-06-08 04:38 GMT
టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక పక్క ప్రొడ్యూసర్ గా నటుడుగా బిజీగా ఉంటూనే  'పా పాండీ'  సినిమాను డైరెక్ట్ చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నాడు. ధనుష్ కుటంబం  విషయం లో ఒక గమ్మత్తు ఉంది అది ఏంటి అంటే అన్నయ్య సెల్వరాఘవన్ డైరెక్టర్ ఇప్పుడు తన భార్య ఐశ్వర్య డైరెక్టర్ - మరదలు సౌందర్య కూడా టాలెంటెడ్ డైరెక్టర్. ఇందరి మధ్యలో తన సత్తా చాటి గొప్పగా నిలబడటం అంటే కత్తి మీద సాములాంటిదే కదా.
 
ధనుష్ తన భార్య ఐశ్వర్య డైరెక్ట్ చేసిన '3' లో నటించాడు. ఇప్పుడు రజినీకాంత్ మరో కూతురు సౌందర్యా డైరెక్షన్ లో వస్తున్న 'VIP 2' మన తెలుగులో రఘువరన్ b.tec కు సీక్వెల్లో నటిస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవ్వరు గొప్ప డైరెక్టర్ అని అడిగితే  “అసలు నేను ముందు సినిమాలలో నటించాలని అనుకోలేదు. నా కుటంబ ప్రభావం తో వచ్చాను ఇక్కడ కొన్నాళ్ళు పని చేసిన తరువాత నాకు అర్ధమైంది ఇదే నాకు సరైన పని అని. ఇకపొతే  ఐశ్వర్య  - సౌందర్య ఇద్దరు కూడా గొప్ప ప్రతిభ ఉన్న దర్శకులే. ఇది నేను ఒక నటుడుగా దర్శకుడిగా చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళు రజిని కూతుర్లు కదా అలానే ఉంటారు. వాళ్ళుకు  క్రాఫ్ట్ పై నాకన్నా ఎక్కువ పట్టు ఉందని చెప్పగలను'' అని భార్య గురించి మరదలు గురించి తెగ గొప్పలు చెప్పేశాడు గురుడు.
 
ధనుష్ కాజోల్ జంటగా నటిస్తున్న విఐపి 2 షూటింగ్ పూర్తికావొస్తోంది. నిన్నే టీజర్ రిలీజైంది. తన మామ సూపర్ స్టార్ 'కాలా'లో కూడా నటించబోతున్నాడు ధనుష్. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News