తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ఉంటుంది.. తెలుగు సినిమాలు అంటే ఉత్తరాదిన ఒక ప్రత్యేకమైన గౌరవంతో ప్రేక్షకులు చూస్తున్నారు. తెలుగు అనే ముద్ర ఉంటే చాలు అన్నట్లుగా చాలా మంది బయ్యర్లు అక్కడ కొనుగోలు చేసి డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
తాజాగా విడుదల అయిన పలు తెలుగు సినిమాలు ఉత్తరాదిన మంచి మార్కెట్ ను దక్కించుకున్నాయి. అందుకే తెలుగు లో తమిళ హీరోలు నటించాలని ఆశ పడుతున్నారు. తెలుగు లో నటించడం వల్ల ఉత్తరాదిన మంచి మార్కెట్ దక్కుతుందని వారు భావిస్తున్నారు. అందుకే పలువురు తమిళ హీరోలు మరియు దర్శకులు టాలీవుడ్ వైపు చూస్తున్నారు.
దర్శకుడు శంకర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తో ఒక సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నాడు. మరో వైపు తమిళ దర్శకుడు లింగు స్వామి తెలుగు లో రామ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
మరో వైపు తమిళ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు ఉబలాట పడుతున్నారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇక తమిళ మరో స్టార్ నటుడు ధనుష్ వరుసగా తెలుగు లో సినిమాలు చేస్తున్నాడు.
ధనుష్ హీరోగా ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా రూపొందుతుంది. మరో వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మూవీ రూపొందాల్సి ఉంది. ఆ రెండు సినిమాలు కాకుండా తాజాగా ధనుష్ తన మూడవ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతోంది.
ధనుష్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతుందట. ఇటీవలే ధనుష్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ను దిల్ రాజు ఇచ్చాడట. ద్వి భాష చిత్రంగా ఒక తెలుగు దర్శకుడి దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ధనుష్ మాత్రమే కాకుండా శివ కార్తికేయన్ కూడా తెలుగు లో బ్యాక్ టుబ్యాక్ సినిమా లు చేస్తానంటున్నాడు.
మొత్తానికి తమిళ హీరోలు తెలుగు మార్కెట్ పై పట్టు సాధించడం తో పాటు ఉత్తర భారతంలో గుర్తింపు దక్కించుకునే ఉద్దేశ్యంతో ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.