చెన్నయ్ వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సెలబ్రిటీలైతే ఆహార ప్రదార్థాల్ని ప్రజలకు చేరవేస్తున్నారు. కనీస అవసరాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మన స్టార్లంతా బిజీగా ఉండే షాపింగ్ మాల్స్ లోకి వెళ్లి ప్రజల్ని అర్థించి భారీగా తిండి ప్రదార్థాల్ని సేకరించిన సంగతి తెలిసిందే. వాటన్నిటినీ రానా చెన్నయ్ వరద బాధితులకు పంపించాడు. ఓ భారీ స్టోరేజ్ ట్రక్ లో ఈ తిండి పదార్థాలన్నిటినీ పంపిస్తే అక్కడ హీరో ధనుష్ రిసీవ్ చేసుకుని అవసరార్థులకు పంచాడు.
ప్రస్తుతం చెన్నయ్ నగరం భయానక పరిస్థితిలో ఉంది. ఆకలి వేస్తే తినడానికి లేదు. దాహం వేస్తే తాగడానికి లేదు. ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వరద తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఏదేమైనా రెండు రోజులుగా వర్షం తగ్గింది. వరద నీరు తగ్గుముఖం పట్టింది. నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనావాసాల నుంచి నీరు తొలగించే పనులు వేగవంతం అయ్యాయి. ఈ వరదల వేళ సెలబ్రిటీలు స్పందించి సామాన్యులకు సాయం చేసిన తీరు అందరికీ నచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ఏకంగా కోటి ఆర్థిక సాయం ప్రకటించి శభాష్ అనిపించారు. కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ కూడా ప్రజల కష్టాల్ని చూసి చలించిపోయి తన శక్తిని మించి కోటి ఆర్థిక సాయం ప్రకటించాడు.
మొత్తానికి ఈ సాయం చెన్నయ్ వాసులకు జీవం పోస్తోంది. రానా చేసిన సాయానికి తమిళ స్టార్ హీరో ధనుష్ కృతజ్ఞతలు తెలిపాడు. హైదరాబాద్ నుంచి తిండి పదార్థాలతో వచ్చిన ట్రక్ ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బావుంది అక్కడ ప్రకృతి విలయ తాండవం చేస్తే మనవాళ్లు ఆదుకున్నారు. ఎక్కడ ఉపద్రవం వచ్చినా సెలబ్రిటీల షేరింగ్ ఉంటుందన్న సిగ్నల్స్ ఇచ్చారు. గుడ్ జాబ్.