ఇప్పటికే ఆల్ రౌండర్ అనిపించుకొంటున్నాడు రజనీకాంత్ పెద్దల్లుడు ధనుష్. హీరోగా - సింగర్ గా - ప్రొడ్యూసర్ గా దుమ్ము రేపుతున్నాడు. ఆయన ఏం చేసినా సరే విజయమే అన్నట్టుంది పరిస్థితి. హీరోగా నేషనల్ అవార్డు అందుకొన్న ఆయన వండర్ బార్ ఫిల్మ్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి నిర్మాతగానూ జాతీయ స్థాయి సినిమాలు తీస్తున్నాడు. ఇక కొలవెరి పాట పాడి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. మొత్తంగా ధనుష్ రజనీకాంత్ కి తగ్గ అల్లుడు అనిపించుకొంటున్నాడు. ఆయన విజయాల్ని చూసి రజనీ సైతం ఉప్పొంగిపోతుంటాడట.
తాజాగా ధనుష్ మరో అడుగు ముందుకేసి డైరెక్టర్ గా కూడా మారాడు. ధనుష్ డైరెక్షన్ 1గా తన సంస్థలో స్వీయ నిర్మాణంలోనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు ధనుష్. పందెం కోడిలో కీలక పాత్రలో కనిపించిన రాజ్ కిరణ్ ఇందులో ప్రధాన పాత్రధారి. `పవర్ పాండీ` పేరుతో ఆ చిత్రం తెరకెక్కుతోంది. ధనుష్ కి మొదట్నుంచీ దర్శకత్వంపై గురి ఉంది. తన అన్నయ్య శ్రీరాఘవ దగ్గర దర్శకత్వానికి సంబంధించి మెలకువలు నేర్చుకున్నాడు. కొంతకాలంపాటు ఆయన దగ్గర సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు సొంతంగా మెగాఫోన్ పట్టాడు. ఆల్ రౌండర్ అనిపించుకుంటున్న ధనుష్ దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల తన నిర్మాణంలో మామ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు ధనుష్. భవిష్యత్తులో మావయ్యని డైరెక్షన్ చేసినా ఆశ్చర్యపోనవరం లేదు.