కొందరు హీరోలు నటనకు పరిమితం కాకుండా వేరే టాలెంట్స్ ని కూడా ప్రదర్శిస్తుంటారు. ఫైట్లు కంపోజ్ చేయడం.. పాటలు పాడటం.. సరదాగా ఒక పాట కూడా కూడా రాసేయడం.. ఇలాంటివి చేసేస్తుంటారు. కొందరు కథలు రాస్తుంటారు, మెగా ఫోన్ కూడా పట్టేస్తుంటారు. ఐతే రెగ్యులర్ గా పాటలు రాసే, పాడే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ కోవలోకే వస్తాడు ఒక సినిమాలో పాటలన్నీ తనే రాసి.. అందులో మెజారిటీ సాంగ్స్ తనే పాడటం ధనుష్ కే చెల్లింది.
తన కొత్త సినిమా ‘తంగమగన్’ను ఇలా సింగిల్ కార్డు వేసుకున్నడు ధనుష్. అనిరుధ్ సంగీతాన్నందించిన ఈ సినిమాలో ఉన్న నాలుగు పాటలన్నీ ధనుషే రాశాడు. అందులో రెండు తనే పాడాడు. ఒక పాటను శ్వేతా మోహన్ తో కలిసి.. ఇంకో పాటను నిఖితా గాంధీతో కలిసి పాడాడు. మరో పాట శ్వేతా మోహన్ సోలోగా పాడింది. ఇంకోటి అనిరుధ్ అందుకున్నాడు.
ధనుష్ - అనిరుధ్ కలిసి ఇలా ఆడియోను డామినేట్ చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు వేల ఇల్ల పట్టాదారి (తెలుగులో రఘువరన్ బీటెక్) - 3 సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. రెండింట్లోనూ పాటలన్నీ ధనుషే రాశాడు. అతను - అనిరుధ్ కలిసి పాడేశారు. ఆ ఆడియోలు రెండూ సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యగా ‘3’ సినిమాలో ధనుష్ రాసి, పాడిన కొలవెరి పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. వేల ఇల్ల పట్టాదారి తర్వాత ధనుష్-అనిరుధ్-వేల్ రాజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘తంగమగన్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.