పొలిటికల్ ఎంట్రీ, MLAగా పోటీ.. బన్నీ వాస్ ఏం చెప్పారంటే?

ఆ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

Update: 2025-02-03 10:42 GMT

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు గురించి అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రెండ్ గా సుపరిచితులయ్యారు. ఆ తర్వాత ప్రముఖ గీతా ఆర్ట్స్ సంస్థలో కీలకంగా మారారు. ఆ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బన్నీ వాసు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. గోదావరి జిల్లాలోని ఒక స్థానంలో బరిలో దిగుతారని టాక్ వినిపించింది. కానీ ఆయన పోటీ చేయలేదు. ఎన్నికల ప్రచారం మాత్రం నిర్వహించారు. కొన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు.

తనను పవన్ పోటీ చేయమని అడిగారని, తానే వెనక్కి తగ్గానని ఓ సందర్భంలో తెలిపారు బన్నీ వాసు. ఇప్పుడు మరోసారి ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన నిర్మిస్తున్న తండేల్ మూవీ.. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బన్నీ వాసు సందడి చేస్తున్నారు.

అలా ఓ ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. తనను పోటీ చేయమని మంచి ఛాన్స్ వచ్చిందని, కానీ తాను రెండు రకాలుగా చూసుకోవాలని అన్నారు. ప్రస్తుత రోజుల్లో రాజకీయాలంటే ఈజీ కాదని, ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవాలని తెలిపారు. అదే సమయంలో తనపై ఉన్న బాధ్యతలను కూడా చూసుకోవాలని చెప్పారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. యాక్టివ్ గా ఉండి ప్రజా జీవితంలోకి వెళ్లాలని, అంతే గానీ పోటీ చేసి సినిమాలు చేస్తూ కూర్చుంటే కుదరని గుర్తు చేశారు. ముఖ్యంగా పవన్ సర్ వంటి వ్యక్తితో ప్రయాణం చేయాలంటే కమిట్మెంట్ చాలా అవసరమని అన్నారు. అది లేకుండా చేస్తే పక్కన పెట్టారంటే మళ్ళీ వెళ్ళడానికి కుదరదని తెలిపారు.

అందుకే అన్ని వదులుకొని ప్రజా జీవితంలోకి వెళ్లినా తనకు, తనకు ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్తానని తెలిపారు. ఇప్పుడు తాను ఇంకా ఎదుగుతున్న సమయంలో అటు వెళ్లడం మంచిది కాదని అనిపించిందని చెప్పారు. అలా అనిపించాక సడెన్ గా తానే ఆగిపోయానని చెప్పారు. ప్రస్తుతం బన్నీ వాసు కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News