భర్త పక్కన ఉండగానే బట్టలిప్పి ఫోటోలకు ఫోజ్
తాజాగా అంతర్జాతీయ వేదిక 67వ గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ మోడల్స్ క్యాట్ వాక్ చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు.
సెలబ్రెటీలు వార్తల్లో ఉంటేనే వారికి మనుగడ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో ఉండటం ద్వారా సినిమాల్లో ఆఫర్లు వస్తాయి, లేదంటే వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంకి ఎక్కువ మంది ఫాలోవర్స్ అయినా లభిస్తూ ఉంటారు. అందుకే సెలబ్రెటీ అనే వారు ఎప్పుడూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనీసం ఇంటర్వ్యూ ద్వారా అయినా వార్తల్లో ఉండాలి అనుకునే వారు ఒక రకం వారు అయితే ఏదో ఒక వివాదం సృష్టించి వార్తల్లో ఉండాలి అనుకునే వారు మరోరకం. ఈమధ్య కాలంలో రెండవ రకం వారు ఎక్కువ అయ్యారు. వివాదం వల్ల ఎక్కువ పబ్లిసిటీ దక్కుతుందని అందరికీ తెలుసు.
ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో పాపులారిటీ కావాలంటే ఎక్కువగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయాల్సి ఉంటుంది. అవార్డు వేడుకల్లో పాల్గొన్న సమయంలో చాలా అందంగా కనిపించడంతో పాటు చాలా ఎక్కువగా స్కిన్ షో చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఆకట్టుకునే అందంతో పాటు స్కిన్ షో చేసిన ముద్దుగుమ్మల ఫోటోలు, వీడియోలకు ఎక్కువగా సోషల్ మీడియాలో రీచ్ ఉంటుంది అని ఎన్నో సందర్భాల్లో నిరూపితం అయ్యింది. అందుకే ముద్దుగుమ్మలు ఎక్కువగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ పాపులారిటీ కావాలంటే అంతకు మించి అని అందాల షో చేస్తారు.
తాజాగా అంతర్జాతీయ వేదిక 67వ గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ మోడల్స్ క్యాట్ వాక్ చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ఆస్ట్రేలియన్ మోడల్ బియాంక సెన్సోరి సైతం ఆ రెడ్ కార్పెట్‌పై కన్నుల విందు చేసింది. ఆమె భర్తతో కలిసి కార్యక్రమంలో పాల్గొంది. భర్త పక్కన ఉండగా మొదట బియాంక సెన్సోరి సాధారణంగానే ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తన డ్రెస్‌ను మెల్లగా తొలగించింది. అయినా ఆ ఫోటోలను చాలా మంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. బియాంక బట్టలు విప్పుతున్న వీడియో ఎక్స్ ద్వార వైరల్ అవుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా బియాంక సెన్సోరి పేరు మారుమ్రోగుతోంది.
గ్రామీ అవార్డ్‌లు లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయ్యారు. అంతే కాకుండా వివిధ దేశాల నుంచి సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. అలాంటి వేదిక మీద ఉన్న సమయంలో బియాంక సెన్సోరి డ్రెస్ విప్పి ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భర్త పక్కన ఉన్న సమయంలోనే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బియాంక దంపతులు తమ వస్త్రాల బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కోసం ఇలా వ్యవహరించి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బియాంక సెన్సోరి అనుకున్నట్లుగానే తమ బ్రాండ్‌కి మంచి పబ్లిసిటీ దక్కింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బియాంక సెన్సోరి గురించి చర్చ జరిగింది.