చందూ మొండేటి తండేల్ శపథం

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా తెరకెక్కిన ‘తండేల్’ మూవీ ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది.

Update: 2025-02-03 11:49 GMT

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా తెరకెక్కిన ‘తండేల్’ మూవీ ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమైన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మించారు. సుమారు 90 కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ ఆర్ట్ వర్క్ కోసమే మెజారిటీగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో రాజు క్యారెక్టర్ కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఇక సాయి పల్లవి బుజ్జితల్లి పాత్రలో కనిపించబోతోంది. సినిమాకి తండేల్ అని పేరు పెట్టిన కూడా ఇదొక అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కిందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఇందులో ముఖ్యంగా రాజు, బుజ్జితల్లి ప్రేమకథని చందూ మొండేటి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని తెలుస్తోంది.

పాకిస్థాన్ జైల్లో బందీ అయిపోయిన రాజు ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బుజ్జితల్లి చేసిన ప్రయత్నం ఏమిటీ అనే అంశాలు కూడా హైలెట్ కానున్నాయట. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయని టాక్. తాజాగా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రేమ కథని లవ్ స్టోరీ ఉన్న ప్రేమికులు అందరూ కనెక్ట్ అవుతారని చందూ మొండేటి బలంగా చెబుతున్నారు.

‘తండేల్’ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బుజ్జితల్లి, రాజు పాత్రలలో మరోసారి తమని తాము చూసుకుంటారని అన్నాడు. ఒకవేళ అలా చూసుకోకపోతే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఇదే విషయాన్ని ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. కచ్చితంగా సినిమాలో లవ్ స్టోరీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని అన్నాడు.

ప్రతి ఒక్కరి జీవితానికి ఆ పాత్రలు దగ్గరగా ఉంటాయని తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే సాయి పల్లవి, నాగ చైతన్య ఆయా పాత్రలకి ప్రాణం పోశారని అర్ధమవుతోంది. మరి ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ వస్తుందని నాగ చైతన్య నమ్మకంగా ఉన్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. సాయి పల్లవి డాన్స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమాలో ఆ ట్రీట్ లభించబోతోంది. అలాగే నేటివిటీ కథలు ఇష్టపడేవారందరూ కూడా ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతున్న నేపథ్యంలో పాత్రల సంభాషణ కూడా ఉత్తరాంధ్ర మాండలికంలో ఉండబోతోంది. అలాగే జాతీయభావం పెంచేలా మంచి సీక్వెన్స్ ఉన్నతాయని తెలుస్తోంది.

Tags:    

Similar News