ఆర్సీ 16 వర్కౌట్ అయితే మళ్లీ రీల్ దే రాజ్యమా?
అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇదే నెగిటివ్ రీల్ టెక్నాలజీని ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఆర్సీ 16 లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం వాడుతున్నాడు.
సినిమా డిజిటల్ అయిన తర్వాత అన్ని సినిమా షూటింగ్ లో డిజిటల్ ఫార్మెట్ లోనే షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఇదే పార్మెట్ లో షూటింగ్ జరుగుతోంది. దీంతో నెగిటివ్ రీల్ పని ఆనాడే అంతమైంది. అప్పటి నుంచి నెగిటివ్ రీల్ లో ఏ సినిమా షూట్ జరగడం లేదు. అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇదే నెగిటివ్ రీల్ టెక్నాలజీని ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఆర్సీ 16 లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం వాడుతున్నాడు.
ఆ సినిమా పీరియాడిక్ నేపథ్యంగల కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ప్రేక్షకులకు రియలిస్టిక్ అనుభూతిని అందించడం కోసం మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లాడు. ఎంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా రత్నవేలు ఇలా ఓల్డ్ టెక్నాలజీకి వెళ్లాడంటే చాలా కారణాలే ఉంటాయి. అయితే ఈ టెక్నాలజీ గనుక వర్కౌట్ అయితే నెగిటివ్ రీల్ ట్రెండ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పీరియాడిక్ చిత్రాలు, చారిత్రాత్మక నేపథ్యంగల సన్నివేశాల కోసం అప్పటి వాతావరణాన్ని స్పృశిస్తూ ప్రత్యేక సెట్లు నిర్మిస్తున్నారు.
ఆయా సన్నివేశాల్ని డిజిటల్ పార్మెట్ లో షూట్ చేయడం వల్ల వాస్తవికత మిస్ అవుతుందనే విమర్శ కొంత కాలంగా వినిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. నెగిటివ్ రీల్ టెక్నాలజీ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. అడ్వాన్స్ డు టెక్నాలజీ ముందు రీల్ ఎందుకు పనిచేస్తుంది? అన్నది మెజార్టీ వర్గం భావనలో ఉంది. అయితే ఆర్సీ 16 తో గనుక ఆ టెక్నాలజీ సక్సెస్ అయితే పీరియాడిక్ నేపథ్యంగల సినిమాలు ఇదే టెక్నాలజీలో షూట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ట్రెండ్ కూడా పీరియాడిక్ సినిమాలదే నడుస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'పౌజీ '1800 బీసీ కాలం నాటి స్టోరీ అనే ప్రచారంలో ఉంది. అలాగే 'హరిహరవీరమల్లు' కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రాల మేకర్స్ కూడా నెగిటివ్ రీల్ కి టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు.