'కబాలి' ఫేమ్ కేపీ చౌదరి ఆత్మహత్య.. కారణమేంటి?

సోమవారం ఉదయం ఆయన నిర్జీవంగా కనిపించినట్లు తెలుస్తోంది.

Update: 2025-02-03 10:30 GMT

ప్రముఖ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి (కృష్ణ ప్రసాద్‌ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఆయన గోవాలో మరణించారు. సోమవారం ఉదయం నిర్జీవంగా తన గదిలో ఆయన కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే కేపీ మరణించిన తర్వాత నటి సురేఖ వాణి కూతురు, అప్ కమింగ్ హీరోయిన్ సుప్రీత పోస్ట్ పెట్టింది. కేపీతో కలిసి దిగిన పిక్ షేర్ చేసి.. "అన్న నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటా.. ఇక నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. వెనక్కి వచ్చేయ్.. మిస్ యు కేపీ అన్న.. లవ్ యూ.. ఎక్కడ ఉన్నా నీవు టైగరే అన్న" అంటూ రాసుకొచ్చింది.

అప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతోపాటు పలు తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి పలు సినిమాలను రిలీజ్ చేశారు. అనేక చిన్న సినిమాలు నిర్మించారు. కానీ నిర్మాతగా ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేకపోయారు కేపీ.

దీంతో గోవాలో పబ్ ను మొదలుపెట్టారు. కానీ అందులో కూడా లాస్ వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తనకు ఉన్న  పరిచయాలతో సెలబ్రెటీలకు డ్రగ్స్‌ విక్రయాలు చేయడం మొదలుపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది.

కేపీ చౌదరి నుంచి నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌ డేటా, వాట్సప్ చాట్‌ లను పోలీసులు వెరిఫై చేసినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. పలు విషయాలపై కూడా ఆయనను ఆరా తీశారని సమాచారం. అంతే కాదు.. టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులకు ఆయన డ్రగ్స్ విక్రయించారని వార్తలు వచ్చాయి.

విచారణలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లను కేపీ చౌదరి చెప్పినట్లు టాక్ వినిపించింది. ఆ తర్వాత కేపీ పేరు ఎక్కడా వినపడలేదు. పెద్దగా ఆయన విషయంలో చర్చ కూడా జరగలేదు. ఇప్పుడు తాజాగా సూసైడ్ చేసుకున్న సంగతి బయటకు వచ్చింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరి కేపీ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News