ఒక రీమేక్ కథతో చియాన్ విక్రమ్ నటవారసుడి సినీఆరంగేట్రం సరైనదేనా? అంటే .. దానికి మిశ్రమ స్పందనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి రీమేక్ `ఆదిత్య వర్మ`తో అతడు తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాతో జస్ట్ పాస్ అనిపించాడు. నటుడిగా ఓకే అన్న టాక్ వినిపించింది. ధ్రువ్ ఇంకా తొలి చిత్ర నటుడే కాబట్టి అతడు కూడా తండ్రిలా షైన్ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వచ్చింది. ఒక రకంగా విజయ్ దేవరకొండ నటన ను చూసిన వారికి ధ్రువ్ యావరేజ్ గా మాత్రమే కనిపించాడు.
అన్నట్టు ఈ నటవారసుడు రెండో మూవీ గురించి ఎప్పుడు ప్రకటిస్తాడు? అంటే అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఈసారి బాగా టైమ్ తీసుకుని ఏదైనా వెరైటీగా ట్రై చేస్తాడా? అన్నది చూడాలి. తాజాగా ధ్రువ్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ న్యూ లుక్ కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ లో ఈ కొత్త లుక్ తన తదుపరి సినిమా కోసమేనా? అన్నది చూడాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం రీమేక్ కాకుండా ఒక కొత్త స్క్రిప్టుతోనే ధ్రువ్ ప్రయోగం చేస్తాడనే భావిస్తున్నారు అభిమానులు.
ఇక నటవారసుడు కొన్ని సంగతులు గుర్తుంచుకుంటేనే షైన్ అవ్వడం సాధ్యమవుతుంది. డాడ్ విక్రమ్ ఓవర్ నైట్ లో స్టార్ కాలేదన్న సంగతిని ధ్రువ్ గుర్తుంచుకోవాలి. విక్రమ్ కెరీర్ ఆరంభం 9నెలలు (క్రాంతికుమార్ దర్శకుడు) అనే సినిమా తో మొదలైంది. అతడు రూ.1000 జీతానికి నటుడి గా చేరిన సంగతి ని గుర్తెరగాలి. సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రానికి అప్పట్లో రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.