ధృవకు మరో 25 స్క్రీన్స్..

Update: 2017-01-02 03:38 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. గత రెండు వారాల్లో వచ్చిన సినిమాల్లో నారా రోహిత్ మూవీ అప్పట్లో ఒకడుండేవాడు మినహాయిస్తే.. మిగిలినవి ఏమీ క్లిక్ కాలేదు. దీంతో ధృవకు స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు.

నాలుగో వారం నడుస్తున్నా ఓవర్సీస్ ప్రేక్షకులు ఇంకా మెగాపవర్ స్టార్ మూవీని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటివకూ 1.41 మిలియన్ డాలర్లను ధృవ రాబట్టగలిగింది. ఇప్పుడు ఏరియాల్లో కలిపి ధృవకు మరో 25 స్క్రీన్స్ ను పెంచుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సంక్రాంతి సినిమాలు వచ్చేవరకూ.. అంటే మరో పది రోజుల పాటు మంచి వసూళ్లు రాబట్టగలిగే అవకాశం ధృవకు వచ్చింది. ఇప్పుడు పెరిగిన స్క్రీన్స్ తో కలిపితే.. 1.5 మిలియన్ల మార్కును అందుకోవడం రామ్ చరణ్ కు తేలికే అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.

నిజానికి ఈ పాటికే ధృవ ఈ మార్క్ ను క్రాస్ చేయాల్సి ఉంది.  ప్రీమియర్ షోలతో తక్కువ మొత్తం రావడంతో.. 1.5 మిలియన్ అందుకునేందుకు కాసింత ఆలస్యం అయింది. మొదటి వారం తర్వాత ఈ చిత్రానికి 1.2మిలియన్ డాలర్ల మార్కును మాత్రమే అందుకోగలుగుతుందని అంతా అంచనా వేశారు. కానీ కంటెంట్ అద్భుతంగా ఉండడంతో లాంగ్ రన్ సాధ్యమయ్యి.. ధృవ 1.5 మిలియన్ డాలర్లను అందుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News