చరణ్ కొత్త సినిమాకు అది పెద్ద బూస్టే..

Update: 2016-12-17 19:30 GMT
ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఎట్టకేలకు రామ్ చరణ్ కు అమెరికాలో ఎట్టకేలకు మిలియన్ క్లబ్బు అందింది. అతడి కొత్త సినిమా ‘ధృవ’ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడంతో పాటు 1.5 మిలియన్ క్లబ్బు దిశగా సాగుతోంది. ఫుల్ రన్లో ‘ధృవ’ యుఎస్ కలెక్షన్లు 1.3-1.4 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ‘ధృవ’ మిలియన్ క్లబ్బును టచ్ చేస్తుందా అని అడిగితే.. మిలియన్ క్లబ్బేంటి 2 మిలియన్ క్లబ్బునే అందుకుంటుందన్నాడు. అతడి నమ్మకం నిలబడకున్నా.. ఇప్పటికి ‘ధృవ’ సాధించిందాని పట్ల సంతృప్తి చెందాల్సిందే.

యుఎస్‌ లో ఇప్పుడు పడ్డ మిలియన్ పునాది మీద.. 2 మిలియన్ బిల్డింగ్ కట్టేయాలన్నది రామ్ చరణ్ ఆలోచన. చరణ్ తర్వాతి సినిమాకే అది సాధ్యమైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చరణ్ నెక్స్ట్ మూవీకి దర్శకుడు సుకుమార్. అమెరికాలో సుకుమార్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడి ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా సినిమాలు తీస్తుంటాడు సుక్కు. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ మూవీ కూడా అక్కడ మిలియన్ మార్కును టచ్ చేసింది. తర్వాత ‘నాన్నకు ప్రేమతో’ ఏకంగా 2 మిలియన్ క్లబ్బును దాటింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా  అంతకుముందు అమెరికాలో ఆదరణ అంతంతమాత్రమే. కానీ సుక్కుతో సినిమా చేసే అతడి రాత మారిపోయింది. ఇప్పుడు ‘ధృవ’తో చరణ్ కు మంచి బేస్ పడింది. సుక్కు సినిమాకు పాజిటివ్ రిజల్ట్ రావాలే కానీ.. ఈజీగా 2 మిలియన్ మార్కును టచ్ చేసే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News