టాలీవుడ్ సంక్రాంతి రేస్ మహా రంజుగా ఉంది. బాలకృష్ణ డిక్టేటర్ జనవరి 14న - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో జనవరి 13న రిలీజ్ డేట్ గా సెట్ చేసుకోవడంతో.. రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంత పోటాపోటీగా విడుదల తేదీలు ప్రకటించారంటే.. అంతా సిద్ధంగా ఉంది అనుకోవడం సహజం. కానీ ఈ రెండు మూవీస్ అప్ డేట్స్ చూస్తే., అసలు విడుదల సాధ్యమేనా అనిపించక మానదు. నిజానికి నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ చిత్రాల షూటింగ్ పార్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదు.
ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సాంగ్స్ ని ఇంకా షూట్ చేయాల్సి ఉంది. ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్టీఆర్ - రకుల్ ప్రీత్ సింగ్ లపై వాటిని పిక్చరైజ్ చేయడం ప్రారంభించారు. మరోవైపు బాలయ్య డిక్టేటర్ కోసం కూడా.. ముమైత్ ఖాన్ తో ఐటెం సాంగ్ ఒకటి షూటింగ్ ప్రారంభించారు. ఈ పాటల పని పూర్తయ్యాక.. ఈరెండు సినిమాలకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టాలి. ఇప్పటికే డిక్టేటర్ కు సంబంధించిన పనులను జనవరి 7కల్లా పూర్తి చేస్తానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాటిచ్చాడట. ఈ టార్గెట్ అందుకునేందుకు మూడు షిఫ్టుల్లో వర్క్ జరుగుతోందని తెలుస్తోంది.
అలాగే జనవరి 8 నాటికి నాన్నకు ప్రేమతో వర్క్ ఫినిష్ చేస్తానని డీఎస్పీ చెప్పాడని తెలుస్తోంది. అసలు దీన్ని ప్రారంభించేందుకు ముందుగానే.. జనవరి 1కి రిలీజ్ షెడ్యూల్ చేసిన నేను శైలజను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది డీఎస్పీ. అయినా సరే డెడ్ లైన్ ను అందుకుంటామని మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. షూటింగ్ - పోస్ట్ ప్రొడక్షన్ - పబ్లిసిటీ వంటి కార్యక్రమాలు అన్నిటినీ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటేనే, యూనిట్ కి డెడ్ లైన్ అందుకోవడం సాధ్యమవుతుంది. మరి ఈ టార్గెట్స్ అందుకుని, సంక్రాంతి పండుగను ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారో ?