ఆ సినిమా ప్లాప్ తో చరణ్‌ నిర్ణయాన్ని మార్చుకున్నాడా?

Update: 2022-04-27 01:59 GMT
రామ్‌ చరణ్ ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడం వల్ల రామ్‌ చరణ్‌ స్టార్‌ డమ్‌ అమాంతం పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ అంచనాల నడుమ రూపొందుతుంది.

శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత భారీగా సినిమాలను ప్లాన్‌ చేస్తున్న రామ్‌ చరణ్ ఇప్పటికే శంకర్‌ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాను కన్ఫర్మ్‌ చేశాడు. ఆ సినిమాకు జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఆ సినిమాను నిర్మించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హిందీలో జెర్సీ సినిమాను గౌతమ్‌ రీమేక్‌ చేశాడు. సినిమాకు మంచి టాక్ వచ్చింది కాని కమర్షియల్‌ గా మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. కేజీఎఫ్ 2 ముందు హిందీ జెర్సీ సినిమా బొక్క బోర్లా పడింది. మినిమం వసూళ్లు కూడా జెర్సీ సినిమాకు రాకపోవడంతో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి పై విమర్శలు వస్తున్నాయి.

జెర్సీ సినిమాను మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా తీయడంలో గౌతమ్ విఫలం అయ్యాడు.. అందుకే రామ్‌ చరణ్ కూడా ఇప్పుడు ఆయనతో సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చరణ్ 16వ సినిమా గా ఈ ఏడాది చివర్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని పుకార్లు మాత్రం ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందని వస్తున్నాయి.

ఇప్పటికే యూవీ క్రియేషన్స్ వారికి రామ్‌ చరణ్ డేట్లు ఇచ్చాడు... గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు స్క్రిప్ట్‌ కు కూడా చరణ్ ఓకే చెప్పాడు. ఇలాంటి సమయంలో సినిమా ను క్యాన్సిల్‌ చేయడం అనేది నిజం కాకపోవచ్చు అంటున్నారు. సినిమా స్క్రిప్ట్ లో జెర్సీ ప్లాప్‌ నేపథ్యంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. కాని మొత్తం సినిమా ను క్యాన్సిల్‌ చేసే నిర్ణయం మాత్రం జరగదు అంటున్నారు.

హీరోగా రామ్‌ చరణ్ ను ఒక విభిన్నమైన క్రీడా నేపథ్యంలో చూపించాలని గౌతమ్‌ తిన్ననూరి ఇప్పటికే కథను రాసుకున్నాడు. అందుకు చరణ్ కూడా ఓకే చెప్పడం జరిగింది. ఇప్పుడు జెర్సీ సినిమా ప్లాప్‌ అయ్యిందని చరణ్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు అనుకోవడం లేదు. అయినా కూడా జెర్సీ సినిమా ప్లాప్ అనుకోవడానికి లేదు. అక్కడ కేజీఎఫ్ 2 సినిమా డామినేషన్‌ వల్ల.. మాస్ ఎలిమెంట్స్ తక్కువ అవ్వడం వల్ల జెర్సీ కమర్షియల్‌ గా నిరాశ పర్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.
Tags:    

Similar News