13 ఏళ్ల గ్యాప్ తర్వాత లేడీ బాస్ విజయశాంతి నటనలోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ నటిస్తున్న క్రేజీ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` సహా పలు భారీ చిత్రాలకు సంతకాలు చేశారు. సరిలేరు... చిత్రంలో విజయశాంతి లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి విజయశాంతి అంగీకరించడం వెనక ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకు తెలిసింది.
ఇది రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమా. కర్నూలు టౌన్ లో జరిగే కథతో తీస్తున్నారు. అయితే సీమకు వెళ్లి షూటింగ్ చేయడం అంటే అక్కడ వాతావరణం కండిషన్ చాలా ఇబ్బందిగానే ఉంటుందన్నది తెలిసిందే. అందుకే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ ను అనీల్ రావిపూడి హైదరాబాద్ పరిసరాల్లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. వాస్తవానికి రాయలసీమకు వెళ్లి అక్కడ కర్నూల్ టౌన్ లోనే చిత్రీకరించాలనుకున్నారు. కానీ విజయశాంతి కండిషన్ల వల్ల కర్నూల్ సిటీని 30 ఎకరాల్లో సెట్ వేసి హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరిస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోకల్ అయితేనే చేస్తానని లేడీ బాస్ కండీషన్ పెట్టడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని ముచ్చటించుకుంటున్నారు. సరిలేరు టీమ్ ఆ మేరకు అంగీకరించారట. రాయలసీమ పల్లెటూరికి వెళ్లేందుకు విజయశాంతి అంగీకరించకపోవడం వల్లనే లోకల్ గా ఒక తోట లాంటి చోట చక్కని ఇంటి సెట్ ని రెడీ చేశారు. ఆల్రెడీ ఇల్లు ఉండి పంట పొలం ఉన్నచోట షూటింగ్ స్పాట్ ని ఎంచుకున్నారు. ఇక ఆ ఇంట్లో అవసరమైన అన్ని మోడ్రన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ పక్కనే మొక్కజొన్న తోటను కృత్రిమ సెట్ వేసి లుక్ మార్చేశారట. దీనివల్ల ఆ ఏరియా బ్యూటీ అదిరిపోయిందని చెబుతున్నారు.
విజయశాంతి డిమాండ్స్ మేరకు అనీల్ రావిపూడి అన్నిటినీ సిద్ధం చేశారు. తన కండిషన్లకు ఒప్పుకుని రావిపూడి ఇవన్నీ సెట్ చేయడంతో పాటు అతడి ఒబీడియెన్స్ కి ఉబ్బితబ్బిబ్బయిన విజయశాంతి ఎఫ్ 3కి కూడా సంతకం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏ ఆర్టిస్టుకు అయినా సౌకర్యం ముఖ్యం. ఆ సౌఖ్యం సౌకర్యం కుదిరాయి కాబట్టే లేడీ బాస్ వెంట వెంటనే సినిమాలకు సంతకాలు చేసేస్తున్నారట. తదుపరి చిరంజీవి- కొరటాల సినిమా విషయంలోనూ ఇలాంటి సౌకర్యం కుదిరిందా? అన్నది తెలియాల్సి ఉంది.