ప్ర‌తాప్ పోత‌న్ ఆ ద‌ర్శ‌కుడితో పోట్లాడేవారా?

Update: 2022-07-17 00:30 GMT
ప్ర‌ముఖ న‌టుడు, వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌తాప్ పోత‌న్ (69) ఇటీవ‌ల చెన్నైలోని ఆయ‌న నివాసంలో గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో 100 కు పైగా చిత్రాల్లో న‌టించిన న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ద‌ర్శ‌కుడిగా హేమా హేమీలైన శివాజీ గ‌ణేష‌న్‌, మోహ‌న్ లాల్ ల‌తో సినిమాలు చేసి ఔరా అనిపించారు. తెలుగులోనూ కింగ్ నాగార్జున తో 'చైత‌న్య‌' పేరుతో ఓ సినిమాని తెర‌కెక్కించి ఆక‌ట్టుకున్నారు.

స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ అయిన ఆయ‌న న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయ‌నపై తెలుగు ద‌ర్శ‌కుడు, న‌టుడు రాజ్ మాదిరాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

'అంకుల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన ఆయ‌న పూరి త‌న‌యుడు ఆకాష్ పూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ 'ఆంధ్రా పోరి' మూవీని రూపొందించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా గ‌త కొంత కాలంగా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారాయ‌న‌.

ప్ర‌స్తుతం 'గ్రే' పేరుతో ఓ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుక రానుంది. ఈ చిత్రంలో దివంగ‌త న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్ ప్రొఫెస‌ర్ గా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి రాజ్ మాదిరాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టి పోస్ట్ వైర‌ల్ గా మారింది. 'గ్రే'సినిమా కోసం ప్రొఫెస‌ర్ పాత్ర అనుకున్న‌ప్పుడు ప్ర‌తాప్ పోత‌న్ గారే గుర్తొచ్చారు. ఆయ‌న‌ని దృష్టిపెట్టుకుని క్యారెక్ట‌ర్ రాశాను.

పూర్త‌యిన‌ర వెంట‌నే ఆయ‌న‌కు ఫోన్ లో వినిపించాను. చాలా బాగా రాశావ‌ని, ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి ఇష్టాప‌డ్డారాయ‌న‌. త‌న పాత్ర‌ని, సినిమాని, నా టీమ్ ని బాగా ఇష్ట‌ప‌డ్డారు. ఇక ఆయ‌న కూడా ద‌ర్శ‌కుడు కావ‌డంతో సెట్లో నేను తీసే సీన్ కు సంబంధించిన లెన్స్‌, లైటింగ్ గురించి మాట్లాడే వారు.

అంతే కాకుండా ఆ విష‌యంలో పోట్లాడే వారు. ఎదురు చెబితే ఆస‌డించుకునేవారు. ఈర్ష ప‌డేవారు. సీన్ పూర్త‌య్యాక చూసి స‌రే అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయేవారు' అని ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజ్ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ ప్ర‌తాప్ పోత‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.
Tags:    

Similar News