విలన్ కారణంగా 'పుష్ప' షూటింగ్ కి బ్రేక్ పడిందా..?

Update: 2021-04-30 14:30 GMT
అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.  మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభన పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకు బ్రేక్ ఇవ్వకుండా షూట్‌ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు 'పుష్ప' షూటింగ్ కి బ్రేక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి.

మహమ్మారి వైరస్ ని లెక్కచేయకుండా 'పుష్ప' చిత్ర యూనిట్ గత కొద్ది రోజులుగా చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సునీల్ - అనసూయ కాంబినేషన్ లో కొన్ని సీన్స్.. ఫహద్‌ ఫాజిల్‌ పాల్గొనే సన్నివేశాలని తీశారు. తర్వాత డేట్స్ సమస్య వస్తుందేమో అని భావించి రిస్క్ అయినా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్ కొనసాగించారు. హీరో అల్లు అర్జున్ కరోనా బారిన పడినా కూడా షూట్ కి బ్రేక్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రోజురోజుకు కరోనా ఉదృతి ఎక్కువ అవుతుండటంతో ఫహాద్‌ హోమ్ టౌన్ కి వెళ్లిపోయారట. దీంతో చేసేదేమీ లేక సుక్కు అండ్ టీమ్ 'పుష్ప' షూట్ ఆపేసారని తెలుస్తోంది.

కాగా, 'పుష్ప' చిత్రంలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్‌ విజేత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'పుష్ప' చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News