'రాధే' ప్లాప్ ఆ ఇద్దరికి మాత్రమే కలిసొచ్చిందా..??

Update: 2021-05-14 10:34 GMT
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఎక్సపెక్ట్ చేయనివి కూడా కొందరికి మంచి నేమ్ ఫేమ్ తీసుకొస్తాయి. అది ఫ్రీ ఏంకాదు కాకపోతే వేరొకరు తమ కంటెంట్ ఉపయోగించినప్పుడు వారికంటే ఒరిజినల్ కంటెంట్ కే ఎక్కువగా పాపులర్ అవుతుంది. నిజానికి ఓ సినిమా కారణంగా ఆ సినిమాకు సంబంధించిన వారికీ కాకుండా వేరేవారు క్రెడిట్ అందుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది. అలాంటి క్రేజ్ అందుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్ దేవిశ్రీ ప్రసాద్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎలాగంటే.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు దువ్వాడ జగన్నాధం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఆడియో పరంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్. అయితే దువ్వాడ జగన్నాధం డీజే సినిమాలోని పాపులర్ బీట్ సాంగ్ 'సీటిమార్' పాటను తాజాగా బాలీవుడ్ సినిమాలో రీమిక్స్ చేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమాలో సీటిమార్ సాంగ్ యూస్ చేశారు. అయితే ఇటీవలే రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ప్లాప్ గా నిలిచింది. రిలీజ్ గురించి ఇంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు విమర్శలు కూడా అందుకుంటుంది. డిజిటల్ రిలీజ్ అయిన రాధే మూవీ నిరాశపరిచినప్పటికీ అందులోని సీటిమార్ సాంగ్ మాత్రం ఓ రేంజిలో హిట్ అయింది.

రెండు వారాల క్రితమే విడుదలైన సీటిమార్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 125మిలియన్స్ వ్యూస్ తో పరుగులు పెడుతోంది. రాధే గురించి మాట్లాడితే కేవలం సీటిమార్ సాంగ్ గురించి ప్రస్తావిస్తున్నారు సల్మాన్ ఫ్యాన్స్. అంటే రాధే మూవీ ద్వారా అటు దేవిశ్రీ ప్రసాద్.. ఇటు డాన్స్ పరంగా అల్లు అర్జున్ మాత్రమే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఈ బాలీవుడ్ క్రేజ్ అనేది తదుపరి అల్లు అర్జున్ సినిమాకు ఉపయోగపడుతుందని టాక్. అంటే ఈ విధంగా అయినా అల్లు అర్జున్ - దేవిలకు బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని సమాచారం. చూడాలి మరి నెక్స్ట్ వీరిద్దరూ పుష్పతో మ్యాజిక్ చేస్తారేమో!
Tags:    

Similar News