సిద్ధార్ద్ - అదితీ ర‌హ‌స్య‌ట్రిప్ కి వెళ్లారా?

Update: 2022-10-29 11:39 GMT
సిద్ధార్ధ్.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పూరిది. బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సిద్దార్ధ్ గ‌త కొంల కాలంగా తెలుగు తెర‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు. గ‌త ఏడాది 'Rx100' ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'మ‌హా స‌ముద్రం'తో సిద్ధార్ధ్ మ‌ళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ మూవీలో అదితీ రావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ లుగా న‌టించారు.

అను ఇమ్మాన్యుయేల్ హీరో శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించ‌గా,  సిద్ధార్ధ్ కు జోడీగా అదితీ రావు హైద‌రీ న‌టించింది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యం నుంచే సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రీ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం మొద‌లు పెట్టార‌ని, ఇద్ద‌రు ప్రేమ‌లో వున్నారంటూ వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

ఇదిలా వుంటే సిద్ధార్ధ్ శుక్ర‌వారం అదితీ రావు హైద‌రీ పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశాడు.

హృద‌య యువ‌రాణికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నీ ప్ర‌తిక‌ల నెర‌వేరాల‌ని కోరుకుంటున్నా' అంటూ అదితితో క్లోజ్ గా వున్న ఓ ఫోటోని షేర్ చేశాడు సిద్ధార్ధ్. దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో వున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

ఇదిలా వుంటే ఈ పుకార్ల‌కు మ‌రింత ఆజ్యం పోస్తూ సిద్ధార్ధ్ , అదితీ రావు హైద‌రీ శుక్ర‌వారం రాత్రి ముంబై  ఏయిర్ పోర్ట్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. అదితి పుట్టిన రోజుని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఈ ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ కి వెళుతుండ‌టం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.

ప్ర‌త్యేక వెకేష‌న్ కి వెళుతున్న సిద్దార్ధ్, అదితీరావు హైద‌రీ ముంబై ఏయిర్ పోర్ట్ లో శుక్రారం రాత్రి కెమెరా కంటికి చిక్కారు. సిద్దార్ధ్ బ్లూక‌ల‌ర్ ష‌ర్ట్, ముఖానికి మాస్క్ తో క్యాజువ‌ల్ లుక్ లో క‌ళ్ల‌కు గాగుల్స్ ధ‌రించి ట్రావెల్ బ్యాగ్ తో ద‌ర్శ‌న‌మియ్య‌గా, అదితీరావు హైద‌రీ బ్లాక్ కోట్‌... బ్లూ జీన్స్ ధ‌రించి త‌ను కూడా ట్రావెల్ బ్యాగ్ తో క‌నిపించింది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ సమ్ థింగ్ జ‌రుగుతోంద‌నే క్లారిటీ వ‌చ్చేసింద‌ని నెటిజ‌న్ లు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సిద్దార్ధ్, అదితీరావు హైద‌రీ ల ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News